దగ్గు బాగా వేధిస్తుందా? ఈ టిప్స్ పాటించండి?

Purushottham Vinay
చాలా మందిని కూడా దగ్గు ఎంతగానో వేధిస్తుంది. అసలు దగ్గు ఎందుకు వస్తుందో ముందుగా తెలుసుకుంటే దానిని తగ్గించడం చాలా ఈజీ అవుతుంది. మీకు అసలు ఎడతెరిపి లేకుండా దగ్గు వస్తుంది అంటే శరీరం తీవ్రమైన అనారోగ్యం బారిన పడబోతుందిగా భావించాలి. మానసికపరమైన కారణాల వల్ల కూడా ఈ దగ్గు సమస్య వేధిస్తుంది. జలుబు చేసినప్పుడు ఇంకా అలాగే ఫ్లూ జ్వరం బారిన పడినప్పుడు పొడి దగ్గు అనేది చాలా ఎక్కువగా వస్తుంది. హైబీపీ వంటి సమస్యలకు వాడే మందుల వల్ల కూడా దగ్గు చాలా ఎక్కువగా వస్తుంది. చిన్న పిల్లల్లో దగ్గు సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా వారికి తేనె వాడడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. గొంతు నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్ ల వల్ల కూడా దగ్గు ఎక్కువగా వస్తుంది. ఈ కారణంగా వచ్చే దగ్గును తగ్గించడంలో ఉప్పు నీరు అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. నీటిలో ఉప్పు వేసి కరిగించి ఆ నీటిని గొంతులో పోసుకుని పుక్కిలించడం వల్ల దగ్గు సమస్య అనేది చాలా ఈజీగా తగ్గుతుంది.


ఈ టిప్ ని ఆహారం తినకముందు ముందు పాటించాలి. తులసి ఆకులను, అల్లం ముక్కలను నీటిలో వేసి మంచి కషాయంలా చేసుకోవాలి. ఈ కషాయాన్ని తాగడం వల్ల కూడా దగ్గు తగ్గుతుంది.ఇంకా అలాగే వేడి నీటిలో పసుపు వేసి ఆవిరి పట్టడం వల్ల కూడా దగ్గు సమస్య నుండి చాలా ఈజీగా ఉపశమనం కలుగుతుంది. అలాగే మసాలా ఎక్కువగా తీసుకున్నప్పుడు కడుపులో తయారయిన యాసిడ్ ల వల్ల కూడా దగ్గు సమస్య ఎక్కువగా వస్తుంది. అలర్జీల వల్ల దగ్గు వచ్చే వారు దుమ్ము, ధూళి ఇంకా అలాగే పుప్పొడి వంటి వాటికి దూరంగా ఉండాలి. రాత్రి పూట తలగడని కూడా ఎత్తుగా పెట్టుకోవాలి. నిద్రపోవడానికి ముందు వేడి నేటిలో తేనెను కలిపి తాగాలి. ఇలా చిన్న చిన్న టిప్స్ వాడినప్పటికి దగ్గు తగ్గకపోతే వెంటనే వైద్యున్ని సంప్రదించి ఖచ్చితంగా తగిన చికిత్స తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: