జలుబు, దగ్గు, సైనస్ పూర్తిగా తగ్గే టిప్?

Purushottham Vinay
చలికాలం వచ్చేసింది. చలి బాగా వణికిస్తుంది. మారుతున్న వాతావరణం ఇంకా అలాగే ఉష్ణోగ్రతలలో తగ్గుదల కారణంగా అనేక రకాల ఆరోగ్య సమస్యలు అనేవి చాలా ఎక్కువగా తలెత్తుతాయి.ముఖ్యంగా ఈ కాలంలో జలుబు, దగ్గు, జ్వరం చాలా కామన్ అయిపోయాయి. ఈ సమస్యలను తగ్గించడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం మాత్రమే మంచి మార్గం. అయితే.. ముక్కు కారటం, దగ్గుతో బాధపడుతుంటే ఇంట్లోనే కొన్ని టిప్స్ పాటిస్తే మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు. వంట గదిలో ఉండే వస్తువుల సహాయంతో డాక్టర్ల దగ్గరికి అసలు వెళ్లాల్సిన పని లేకుండా వ్యాధి ని నివారించుకోవచ్చు. జలుబు చేసిన సమయంలో అందరూ సూచించే ఒకే ఒక పద్ధతి ఏంటంటే అదే ఆవిరి పట్టడం. దీనిని డాక్టర్లు కూడా సిఫార్సు చేశారు. వేగవంతమైన, సత్వర ఉపశమనం ఇంకా సమర్థవంతమైన ఫలితాలను పొందడానికి ఆవిరి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అయితే ఆవిరి పట్టడంలోనూ కొన్ని టిప్స్ ఇంకా ఆయుర్వేద ఔషధాలను యాడ్ చేసుకుంటే అదనపు బెనెఫిట్స్ పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందు కోసం సరికొత్త ఆవిర పద్ధతిని వారు పరిచయం చేస్తున్నారు.


అందుకోసం ఒక టీ స్పూన్ యాలకులు, 10 నుంచి 15 తులసి ఆకులు, చిటికెడు పసువు ఇంకా 4 నుంచి 5 పుదీనా ఆకులను వేడి నీటిలో వేసి 5 నిమిషాల పాటు పాత్రను మూతతో కప్పి ఉంచాలి. తర్వాత ఒక పెద్ద, మందపాటి టవల్ను తీసుకుని మీ తలపై ఉంచాలి. అలాగే వేడినీటితో ఉన్న పాత్రను టేబుల్‌పై ఉంచాలి. ఇక మీ ముఖాన్ని పాత్ర పైన ఉంచాలి. ముఖాన్ని ఇంకా పాత్రను టవల్‌తో పూర్తిగా కప్పాలి. లోపలి గాలి బయటకు వెళ్లకుండా అలాగే బయటి గాలి లోపలికి రాకుండా కప్పుకోవాలి. అయితే ముఖానికి ఇంకా పాత్రకు మధ్య తగినంత దూరం ఉండేలా ఖచ్చితంగా చూసుకోవాలి. ఎందుకంటే వేడి నీటి నుంచి వచ్చే వేడి మీ ముఖానికి ఖచ్చితంగా కూడా హాని కలిగించవచ్చు. ఇలా 45-60 సెకన్లకు ఒకసారి చేస్తూ మీరు ఆవిరి పట్టాలి.బాగా ఆవిరి పట్టడం ద్వారా ముక్కు ద్వారాల్లో పేరుకున్న శ్లేష్మం ఆవిరవుతుంది. శ్వాసనాళాల్లో చేరుకున్న కఫం కూడా తేలికవుతుంది. అందువల్ల చాలా ఈజీగా శ్వాస తీసుకునే అవకాశం కలుగుతుంది. అలాగే మీ ఊపిరితిత్తులకు రిలీఫ్ కలుగుతుంది. జలుబు ఇంకా దగ్గును నయం చేస్తుంది. సైనస్‌ను నుంచి కూడా మీకు విముక్తి కలిగిస్తుంది. ఇంకా అంతే కాకుండా తేలికైన అనుభూతిని కలిగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: