మీ జుట్టు అందంగా పొడుగ్గా పెరగాల..అయితే వీటిని తినాల్సిందే..!!

Divya
 మనకున్న ఆహారా అలవాట్లు మీద మన అందము గానీ, జుట్టు ఆరోగ్యం గాని ఆధారపడి ఉంటుంది. అలాంటి ఆహారాలతో జుట్టు బాగా పెరగాలంటే బయోటిన్ ఎక్కువగా తీసుకోవాలి. బివిటమిన్ అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవడంవల్ల మన అందం,ఆరోగ్యం పెరుగుతాయి. ముఖ్యంగా బయోటిన్ లేదా బి 7 ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అలాంటి ఆహారాలేంటో ఇప్పుడు చూద్దాం..
 దారుణంగా మన శరీరానికి బయోటిన్ 30 గ్రాములు అవసరం. ఒక పరిశోధనలో బయోటిన్ ఎక్కువగా ఉన్న ఆహారాలను 90 రోజులపాటు తీసుకోవడంవల్ల జుట్టు మిగతా వారి కన్నా 30% అధికంగా పెరిగిందని నిరూపించారు. బి7 విటమిన్ వల్ల జుట్టు పెరగడానికి కావలసిన ప్రోటీన్ అయినా కెరొటీన్ పెరగడానికి తోడ్పడే కేరటినో సైడ్స్ నీ మీద ప్రభావం చూపి జుట్టు అందంగా, ఆరోగ్యాంగా పెరగడానికి దోహదం చేస్తుంది. బయోటిన్ అధికంగా ఉన్న ఆహారాలు..

1). పుట్టగొడుగులు..
 సాధారణంగా పుట్టగొడుగులు అనేక మాంసకృతులను కలిగిఉంటుంది. ఇందులో బయోటిన్ పుష్కలంగా ఉంటుంది. 100gms పుట్టగొడుగులు తినడంవల్ల మన శరీరానికి కావలసిన 30 గ్రామ్స్ బయోటిన్ ఉత్పత్తి చేస్తుంది. అందువల్ల శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా జుట్టు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
2). పన్నీర్..

 మంచి తయారు చేసే పనీర్ లో తక్కువ కార్బోహైడ్రేట్స్, ఎక్కువ ఫాట్స్, లో కేలరీస్ అందువల్ల శరీర బరువు తొందరగా తగ్గుతుంది. అంతేకాకుండా ఇది జుట్టు ఆరోగ్యానికి కూడా పెంచుతుంది.
 3).అవిసె గింజలు..
 అవిసెగింజలపొడిని మన రోజువారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల, బయోటిన్ పుష్కలంగా అందుతుంది.ఇది జుట్టు కుదుళ్ళు దృఢంగా అవడానికి సహాయపడుతుంది.
4). ఆకుకూరలు..
 ఆకుకూరల్లో బయోటిన్ అధిక వున్న ఆకుకూర చేమదుంపల ఆకు. ఇందులో 30gm బయోటిన్ ఉంటుంది. మరియు ఉల్లికాడలు, మెంతికూర బయోటిన్ అధికంగా ఉన్న ఆహారం అని చెప్పవచ్చు. ఎక్కువగా తీసుకోవడం వల్ల జుట్టు తొందరగా,ఆరోగ్యంగా పెరుగుతుంది.ఎవరైనా సరే జుట్టు సమస్యతో బాధపడుతున్న వారు వీటిని తినడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: