ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ నీళ్లు ఎప్పుడు తాగాలి?

Purushottham Vinay
ప్రతి రోజూ కూడా నీరు ఖచ్చితంగా తాగాలి.తగినంత నీరు తాగకపోతే డీహైడ్రేషన్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు, కీళ్ళు, కండరాల సమస్యలతో సహా పలు ఆరోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉంది. అయితే తాగునీటితో పాటు నీరు తాగడానికి సరైన సమయం కూడా ఎంతో ముఖ్యం.భోజనం చేసిన తర్వాత నీళ్లు తాగాలని కొందరంటే, మరికొందరు భోజనానికి ముందు తాగమని సలహా ఇస్తున్నారు. ఆయుర్వేద నిపుణుల ప్రకారం.. భోజనానికి 30 నిమిషాల ముందు లేదా భోజనం చేసిన 30 నిమిషాల తర్వాత నీరు తాగడం మంచిది. ఆహారంతో పాటు నీళ్లు తాగకూడదు. భోజనంతో పాటు ఒక గ్లాసు లేదా అంతకంటే ఎక్కువ నీరు మీ కడుపు జీర్ణ శక్తిని తీవ్రంగా దెబ్బతీస్తుంది. అవసరమైతే ఇన్సులిన్ స్థాయిలు గణనీయంగా మారడానికి కారణమవుతాయి. కాబట్టి అవసరమైతే భోజనంతో పాటు కొంచెం నీరు తాగండి.భోజనం చేసిన గంట తర్వాత ఎప్పుడూ నీళ్లు తాగాలి.దీనివల్ల ఆహారంలోని పోషకాలను శరీరం గ్రహించగలుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.మీరు నిద్రలేవగానే కనీసం ఒక గ్లాసు నీరు తాగండి. ఇది అనారోగ్యంతో పోరాడటానికి అవసరమైన రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.


అలసటను ఎదుర్కోవడానికి మధ్యాహ్నం కనీసం ఒక గ్లాసు నీరు తాగాలి. మధ్యాహ్నం సమయంలో చాలామందికి డీహైడ్రేషన్ సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి తగినంత నీరు తాగితే అలసట, నీరసం ఇతర సమస్యలను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది.ఒక వ్యక్తి అలసిపోయి, బలహీనంగా, సన్నగా ఉండి బరువు పెరగడానికి ప్రయత్నిస్తున్న వారు భోజనం చేసిన 30 నిమిషాల తర్వాత నీల్లు తాగాలి. దీనికి విరుద్ధంగా, ఒక వ్యక్తి ఊబకాయం, అధిక బరువు, హార్మోన్ల అసమతుల్యత లేదా శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉన్నట్లయితే, అతను / ఆమె భోజనానికి 30 నిమిషాల ముందు నీరు తాగాలి. ఇక భోజనానికి ముందు ఒక గ్లాసు నీరు తాగడం వల్ల పొట్ట డిటాక్సిఫై అవుతుంది. ప్రతిరోజూ తగినంత నీరు తాగడం చాలా అవసరం. ఇది మీ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే శరీరం నుండి విష పదార్థాలను బయటకు పంపించడం, లాలాజలం సృష్టించడం, శరీరంలోని వివిధ భాగాలకు పోషకాలను రవాణా చేయడం వంటి కీలకమైన శారీరక విధుల్లో సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: