పొద్దున్నే పరగడుపున నీళ్లు తాగితే కలిగే లాభాలు?

Purushottham Vinay
ప్రతిరోజూ కూడా పొద్దున్నే పరగడుపున ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల జీర్ణ ప్రక్రియ సరిగ్గా జరుగుతుంది. జీర్ణక్రియ సమస్యలతో బాధపడే వారు ప్రతిరోజూ ఇలా గోరు వెచ్చని నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుందని వారు చెబుతున్నారు. గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. శరీరంలోని వ్యర్థ పదార్థాలు కూడా తొలగిపోతాయి. అలాగే నీరసం, శ్వాస సంబంధిత సమస్యలు, కీళ్ల నొప్పులతో బాధపడే వారు ఇలా ప్రతిరోజూ గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల ఆయా సమస్యల నుండి ఉపశమనం కలుగుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. వ్యాయామాలు చేసినప్పుడు, జిమ్ కి వెళ్లి వర్క్ అవుట్స్ చేసినప్పుడు శరీరం బాగా వేడెక్కుతుంది. చెమలు బాగా బయటకు వస్తూ ఉంటాయి.అలాంటప్పుడు చల్లటి నీటిని తాగడం ఉత్తమమని వారు చెబుతున్నారు. వేసవి కాలంలో ఎండలు ఎలా మండుతూ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు.


కాబట్టి ఎండకు బయటకు వెళ్లి వచ్చినప్పుడు ఒక గ్లాస్ చల్లటి నీటిని తాగడం ఉత్తమం. అలాగే అన్నం తినేటప్పుడు చల్లని నీటిని తాగడం వల్ల శరీరం వేడికి గురిఅవుతుందని జీర్ణమయ్యేందుకు చాలా సమయం పడుతుందని వైద్యులు సూచిస్తున్నారు. చల్లటి నీటి కంటే వేడి నీటిని తాగడమే ఉత్తమం అని రక్తప్రసరణ, జీర్ణక్రియ బాగా జరుగుతాయని సూచించారు. బయట ఎండకు తిరిగి వచ్చినప్పుడు చల్లటి నీటిని తాగడం ఆరోగ్యానికి మంచిది. చాలా మంది ఉదయాన్నే టీ, కాఫీ వంటివి తాగుతారు.వాటికి బదులుగా ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తీసుకుంటే చాలా ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి రోజూ పొద్దున్నే పరగడుపున గోరు వెచ్చటి నీళ్లు తాగండి. అది కూడా శుభ్రంగా బ్రష్ చేశాకే తాగండి. ఎందుకంటే పాచి నోటితో నీళ్లు తాగితే మీ నోటిలో వున్న బాక్టీరియా నీళ్లతో పాటు కడుపులోకి పొయ్యే ప్రమాదం వుంది. అందుకే నోటిని శుభ్రం చేసుకున్నాకా తాగండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: