ఆహారం ఎక్కువగా తింటున్నారా.. ప్రమాదమేనా..?

Divya
మనదేశంలో ఆహార పదార్థాలతో పోలిస్తే ఎక్కువగా అన్నాన్ని తింటూ ఉంటారు ప్రజలు. అది కూడా మూడు పూటలా ఎక్కువగా తింటూ ఉంటారు. కానీ ఈ ఆహారం వల్ల మనం మన శరీరానికి అందే పోషకాలు చాలా తక్కువగా ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు. దీనిలో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు అనేవి అసలు ఉండవట.అందుచేతనే అన్నాన్ని తక్కువగా తిని కూరగాయలు పండ్లను ఎక్కువగా తింటూ ఉండాలని వైద్యులు సూచిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి పద్ధతిని పాటించేవారు చాలా తక్కువ మందే ఉంటారని చెప్పవచ్చు. మనం వండుకు తినే అన్నం లో ఎక్కువగా కార్బోహైడ్రేట్లు ఉండడం వల్ల రక్తంలో గ్లూకోస్థాయిని విపరీతంగా పెంచేస్తాయి దీంతో షుగర్ పేషెంట్లు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది.

కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండడం వల్ల వీటిని తరచు తిన్నట్లు అయితే అధిక బరువు పెరిగేందుకు ఆస్కారం ఉంటుందట. అందుచేతనే బరువు తగ్గాలనుకున్నవారు కార్బోహైడ్రేట్లు ఉండే పదార్థాలను తక్కువ మొత్తం తినడం మంచిది. ఇక బియ్యంతో చేసిన పిండి పదార్థాలను తక్కువగా తినడం చాలా మంచిది. దీనివల్ల శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు. తక్కువ కార్బోహైడ్రేట్లు కలిగి ఉన్న వాటిని తినడం వల్ల భవిష్యత్తులో షుగర్ బారిన పడే అవకాశం ఉండదని ఒక కొత్త అధ్యయనంలో తెలియజేయడం జరిగింది.

డయాబెటిస్ రోగులు కచ్చితంగా కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే ఆహారాలని తినడం మంచిది. మొత్తంలో అన్నం తక్కువగా తిని పండ్లు కాయగూరలు తరచూ తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంచుకోవచ్చు. అంతేకాకుండా బరువు కూడా తగ్గుతారని వైద్యులు తెలియజేస్తున్నారు. అలాగే అలర్జీ, మలబద్ధకం వంటి సమస్యలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటాయి. అందుచేతనే ఎక్కువగా సెలబ్రిటీలు సైతం భోజనాన్ని చాలా తక్కువగా తింటారు ఎక్కువగా కాయగూరలు ,పండ్లు ,సలాడ్స్, తదితర వాటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అందుచేతనే అన్నం ఎక్కువగా తినకపోవడం మంచిదని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: