టమాట జ్యూస్ తాగితే కలిగే లాభాలు?

Purushottham Vinay
టమాటాలలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. వీటిలోని ఫైబర్ శరీరంలోని కొవ్వును కరిగించి బరువును తగ్గిస్తుంది. కనుక టమాటా జ్యూస్‌ను రోజూ తాగితే బరువు ఇట్టే తగ్గుతారు. అలాగే టమాటాల్లో ఉండే లైకోపీన్ యాంటీ ఆక్సిడెంట్‌. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో సీజనల్ వ్యాధులైన దగ్గు, జలుబు, జ్వరం వంటివి తగ్గుతారు. టమాటాల్లో ఉండే ఐరన్ రక్తం బాగా తయారయ్యేలా చేస్తుంది. రక్తహీనత ఉన్నవారు రోజూ ఒక కప్పు టమాటా జ్యూస్‌ను తాగితే వారం రోజుల్లోనే రక్తం బాగా పెరుగుతుంది. దీంతో అలసట, నీరసం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. టమాటా జ్యూస్‌ను తాగితే రక్త నాళాలు శుభ్రంగా మారుతాయి. రక్త నాళాల్లో ఉండే కొవ్వు కరుగతుంది. దీంతో హార్ట్ ఎటాక్‌లు రావు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే టమాటా జ్యూస్‌ను తాగితే షుగర్ కంట్రోల్ అవుతుంది. క్యాన్సర్ కణాలు పెరగకుండా ఉంటాయి. ఇలా టమాటా జ్యూస్‌తో మనం ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.


అలాగే బాక్టీరియా, వైరస్ ఇన్‌ఫెక్షన్లు, వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.బ్రేక్ ఫాస్ట్ తరువాత ఒక కప్పు మోతాదులో టమాట జ్యూస్‌ను రోజూ ఉదయం తాగడం వల్ల ఎన్నో అద్భుతమైన లాభాలను పొందవచ్చు. టమాటా జ్యూస్‌ను తాగడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. ఈ పండ్లలో ఉండే ఫైబర్ గ్యాస్‌, అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలను తగ్గిస్తుంది.అయితే కిడ్నీ స్టోన్స్ సమస్య ఉన్నవారు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు మాత్రం డాక్టర్ల సలహా మేరకు ఈ జ్యూస్‌ను తాగాల్సి ఉంటుంది. ఇక టమాటాలు ఆర్గానిక్ విధానంలో పండించినవి అయితే మంచిది. దీంతో సైడ్ ఎఫెక్ట్స్ రావు. రసాయనాలు వేసి పండించిన టమాటాలు అయితే శుభ్రంగా కడిగిన తరువాతే జ్యూస్ పట్టాలి. లేదంటే అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి టమాటా జ్యూస్‌ను తాగే విషయంలో ఈ జాగ్రత్తలను పాటించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: