బెల్లం: ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా?

Purushottham Vinay
చలికాలం వచ్చేసింది. వానా కాలం తరువాత ఎక్కువగా జబ్బులు వచ్చేది ఈ కాలంలోనే. ఎందుకంటే వాతావరణం. ఈ కాలంలో జీవ రాసులకు కావాల్సిన టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. ఒక జీవి బ్రతకాలంటే ఎనర్జీ కావాలి. ఎనర్జీ కావాలంటే శరీరానికి సరిపడేంత వేడి కావాలి. ఆ వేడి చలికాలంలో అంతగా దొరకదు. అందుకే రోగాలు వస్తుంటాయి.అందువల్ల జీవికి ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ కాలంలో చాలా మందికి కూడా జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధులు చాలా ఈజీగా వస్తాయి. వీటన్నింటికీ బెల్లం పరిష్కారంగా వాడుకోవచ్చు..బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. శరీరంలోని ఎర్రరక్తకణాలను నిర్వహిస్తుంది. శరీరానికి కావల్సిన ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుంది. కణాల విస్తరణను పెంచి రక్తహీనతను నివారిస్తుంది.కడుపునొప్పి అనేది ప్రతి స్త్రీని వేధించే సమస్య. బెల్లం ఈ కాలంలో తీవ్రమైన నొప్పిని తగ్గిస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలను నయం చేస్తుంది. ఇది ఎండార్ఫిన్స్ అనే హార్మోన్లను కూడా విడుదల చేసి మానసిక స్థితిని సమతుల్యం చేస్తుంది. రక్తహీనతను నివారిస్తుంది.


బెల్లంలో పొటాషియం, సోడియం ఉంటాయి. ఇవి శరీరంలో యాసిడ్ స్థాయిని నిర్వహించడంలో సహాయపడతాయి. ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. హృదయ సంబంధ వ్యాధుల నుండి రక్షిస్తుంది.బెల్లం జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. భోజనం తర్వాత బెల్లం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ సులభతరం అవుతుంది. జీర్ణ ఎంజైమ్‌లకు మరింత పోషణ లభిస్తుంది. కీళ్లనొప్పులకు నివారణగా బెల్లంగా వాడతారు. ఇందులోని కాల్షియం మూలం. బెల్లం పాలతో కలిపితీసుకుంటే కీళ్లనొప్పులకు మేలు చేస్తుంది.క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, ఫాస్పరస్, జింక్, కాపర్, థయామిన్, రైబోఫ్లావిన్, నియాసిన్ బెల్లంలో ఉంటాయి. ఇది శరీరానికి మేలు చేస్తుంది. బెల్లంలో ఉండే మినరల్స్, ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి రోగాల బారిన పడకుండా కాపాడతాయి.కాబట్టి ఖచ్చితంగా బెల్లాన్ని వాడండి. సంపూర్ణ ఆరోగ్యంగా జీవించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: