కిడ్నీ స్టోన్స్ సమస్యని తగ్గించే హోమ్ రెమెడీ?

Purushottham Vinay
ఒక గ్లాస్ నీటిలో ఒక టేబుల్ స్పూన్ మెంతులను వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ నీటిని పరగడుపున తాగాలి. ఈ విధంగా చేస్తే మూత్రపిండాల్లో రాళ్లు తొలగిపోతాయి. అంతేకాకుండా మెంతుల నీటిని తాగడం వల్ల శరీరంలోని వ్యర్థ పదార్థాలు కూడా తొలగిపోతాయి. అరటి చెట్టు బెరడు.. దీనిని కూరగా వండుతారు. అరటి చెట్టు కాండంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల తక్కువ పరిమాణంలో ఉండే రాళ్లు మూత్ర మార్గం నుండి బయటకు పోతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే కొత్తిమీర కూడా ఈ సమస్య నుండి బయట పడడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కొత్తిమీరను మనం వంటలల్లో గార్నిష్ గానే వాడతాం. కానీ కొత్తిమీర మనకు చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఒక గిన్నెలో నీటిని పోసి వేడి చేయాలి.నీళ్లు వేడయ్యాక కొత్తిమీర ఆకులను వేసి మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకుని తాగాలి. ఇలా చేయడం వల్ల కూడా మనం చక్కటి ఫలితాలను పొందవచ్చు. అలాగే నేరేడు పండ్లను తీసుకోవడం వల్ల కూడా మూత్రపిండాల్లో రాళ్లు తొలగిపోతాయి.


నేరేడు పండ్లు దొరికే కాలంలో వాటిని రోజుకు ఒకటి చొప్పున తీసుకున్నా చాలు మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోతాయి. జీర్ణాశయంలో ఉండే రాళ్లు, వెంట్రుకలు కూడా వీటిని తీసుకుంటే కరిగిపోతాయి. ఈ చిట్కాలను పాటించడం వల్ల మూత్రపిండాల్లో ఉండే రాళ్లను చాలా సులభంగా తొలగించుకోవచ్చు.మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నాయని తెలిసిన వెంటనే నీటిని ఎక్కువగా తాగడం, ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం చేయాలి. రోజుకు కనీసం 5 నుండి 6 లీటర్ల నీటిని తీసుకోవాలి. మూత్రపిండాల్లో రాళ్లను కరిగించడానికి ఇది చక్కటి చిట్కా. అలాగే మెంతి నీటిని తాగడం వల్ల కూడా మూత్రపిండాల్లో రాళ్ల నుండి ఉపశమనం కలుగుతుంది.అయితే ఈ టిప్స్ కేవలం 5 మిల్లీ మీటర్లు కంటే తక్కువ ఉంటేనే ఫాలో అవ్వాలి.5 మిల్లీ మీటర్లు లేదా ఆపై ఉన్న వాటిని ఆపరేషన్ చేసి తీయాలి. ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: