షుగర్ ఈజీగా తగ్గాలంటే ఇలా చెయ్యండి?

Purushottham Vinay
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం దోసకాయం తినడం వలన రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. వాస్తవానికి ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది రక్తంలో ఉన్న చక్కెర స్థాయిని తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తుంది. అందుకే రోజూ ఒక దోసకాయను తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.దోసకాయను మీరు చాలా రకాలుగా తినొచ్చు. దోసకాయ సూప్ చేసుకునే సమయం లేకపోతే.. దానిని సలాడ్ రూపంలోనూ తినొచ్చు. డయాబెటిస్ పేషెంట్ అయితే, రోజూ ఒక దోసకాయ తినేందుకు ప్రయత్నించాలిన సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.మధుమేహం నుంచి ఉపశమనం పొందడానికి దోసకాయను అనేక విధాలుగా ఆహారంలో చేర్చుకోవచ్చు. డయాబెటిస్ నుంచి త్వరగా ఉపశమనం పొందాలనుకుంటే ప్రతీరోజూ దోసకాయ సూప్ తీసుకోవాలి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడమే కాకుండా, జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది.డయాబెటిక్ రోగులకు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడం చాలా ముఖ్యం.


రక్తంలో చక్కెర సకాలంలో నియంత్రించకపోతే, అది ఇతర వ్యాధులకు కారణం అవుతుంది. బ్లడ్ షుగర్‌ను కంట్రోల్ చేసేందుకు మెడిసిన్స్‌తో పాటు.. మనం తినే ఆహారం కూడా దోహదపడుతుంది. వాటిల్లో ముఖ్యంగా దోసకాయను ప్రధానంగా చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. దోసకాయను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా బ్లడ్ షుగర్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చునని చెబుతున్నారు.దోసకాయ సూప్‌ ఆరోగ్యానికి చాలా మంచిది.తయారు చేయడానికి ఒక దోసకాయ సరిపోతుంది. ఇందుకోసం దోసకాయను కట్ చేయాలి. ఆ తరువాత 3 టీ స్పూన్ల నిమ్మరసం, 1 చిన్న ఉల్లిపాయ, 1 వెల్లుల్లి రెబ్బ, 1/4 ఆలీవ్ నూనె, 1/2 కప్పు కొత్తిమీర, ఒక టీస్పూన్ జీలకర్ర, సరిపడా ఉప్పు, మిరియాల పొడి కలపాలి. ఈ పదార్థాలన్నింటినీ బ్లెండర్‌లో వేసి మిక్స్ చేయాలి. ఆ తరువాత మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దీనిని సూప్‌గా తీసుకోవచ్చు. దీని వల్ల షుగర్ తగ్గడమే కాకుండా, వేగంగా బరువు కూడా తగ్గుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: