ఎముకలను దృఢంగా ఉంచే ఆహార పదార్ధాలు?

Purushottham Vinay
ఎముకలు గట్టిగా బాగా బలంగా ఆరోగ్యంగా వుండాలంటే ఖచ్చితంగా ఈ గింజలను తీసుకోవాలి. ఎందుకంటే ఈ గింజలను తీసుకోవడం ద్వారా కాల్షియం లోపాన్ని అధిగమించడంతోపాటు.. ఎముకలు దృఢంగా తయారవుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..అమర్‌నాథ్ విత్తనాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ గింజలను తినడం వల్ల కాల్షియం లోపం తొలగిపోతుంది. రోజూ ఒక కప్పు అమర్నాథ్ గింజలు తింటే ఎముకల బలహీనత తొలగిపోతుంది. అలాగే ఇందులో ఉండే పోషకాలు రక్తకణాల సంఖ్యను పెంచడంలో సహకరిస్తాయి. ఈ విత్తనాలను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.నువ్వుల్లో ఆరోగ్యానికి మేలు చేసే అనేక పోషకాలు దాగున్నాయి. నువ్వులు కాల్షియానికి మంచి మూలం. నువ్వులను లడ్డు లేదా మరే ఆహారంలోనైనా చేర్చుకోవచ్చు. దీనిని రెగ్యులర్‌గా తీసుకుంటే కాల్షియం లోపం సులభంగా తీరిపోతుంది.అవిసె గింజల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. రోజూ 1-2 స్పూన్ల అవిసె గింజలను తింటే, కాల్షియం లోపం తొలగిపోతుంది.


 అవిసె గింజలను నానబెట్టి లేదా ఫ్రై లాగా చేసుకుని తినవచ్చు.పొద్దుతిరుగుడు విత్తనాలలో కాల్షియం గణనీయమైన మొత్తంలో కనిపిస్తుంది. కాల్షియం లోపం ఉన్నట్లయితే మీ రోజువారీ ఆహారంలో ఒక కప్పు పొద్దుతిరుగుడు గింజలను చేర్చుకోండి. పోషకాలు అధికంగా ఉండే పొద్దుతిరుగుడు విత్తనాలు దృఢమైన ఎముకలను నిర్మించడానికి అలాగే కండరాల ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.చియా గింజల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కాల్షియం లోపం ఉన్నట్లయితే, ప్రతిరోజూ 1-2 టీస్పూన్ల చియా విత్తనాలను తినడం ద్వారా దాని లోపాన్ని అధిగమించవచ్చు. చియా గింజలలో పోషకాల సంపద దాగి ఉంది. కాల్షియం కాకుండా, ఇది మెగ్నీషియం, ఫాస్పరస్ కి మంచి మూలం.గసగసాలు కాల్షియానికి మంచి మూలం. మీరు ప్రతిరోజూ 1 టీస్పూన్ గసగసాలు తింటే.. కాల్షియం లోపాన్ని అధిగమించవచ్చు. గసగసాలు నేరుగా తినలేకపోతే.. వాటిని ఖీర్ లేదా లడ్డూలలో వేసి కూడా తినవచ్చు.కాబట్టి ఈ గింజలని ఖచ్చితంగా తినండి. ఎముకలని దృఢముగా ఉంచుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: