పైల్స్ సమస్యని తగ్గించే సింపుల్ టిప్?

Purushottham Vinay
చాలా మంది కూడా మొలల వ్యాధితో అష్ట కష్టాలు పడుతుంటారు.అయితే ఈ మొలలను తగ్గించే శక్తి పసుపుకు ఉంది. మొలలను తగ్గించడంలో పసుపు మంచి దివ్యౌషధంగా పని చేస్తుంది. ఆముదంలో పసుపును కలిపి చర్మానికి రాసుకోవాలి. ఈ మిశ్రమం ఆరిన తరువాత స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల దురదలతోపాటు ఇతర చర్మ రోగాలు కూడా నయం అవుతాయి. శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వును కూడా పసుపు కరిగించగలదు. దీనికోసం మనం పసుపుతో ఒక పానీయాన్ని తయారు చేసుకుని వాడాల్సి ఉంటుంది. ముందుగా ఒక గ్లాస్ వేడి నీటిలో పసుపును వేసి కలపాలి. తరువాత అందులో కొద్దిగా దాల్చిన చెక్క పొడిని, నిమ్మరసాన్ని, తేనెను వేసి బాగా కలపాలి. ఈ పానీయాన్ని రోజూ తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. అధిక బరువు తగ్గుతారు. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. కీళ్ల నొప్పులు తగ్గుతాయి.


ఈ పానీయాన్ని తాగడం వల్ల మలబద్దకం సమస్య తగ్గు ముఖం పడుతుంది.జీర్ణశక్తి మెరుగుపడుతుంది. దీనిని క్రమం తప్పకుండా రోజూ తాగడం వల్ల శరీరంలో రోగ నిరధక శక్తి బలపడుతుంది. దీంతో మనం ఇన్ ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాం. ఈ విధంగా పసుపు మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతుందని పసుపును వాడడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.ఇంకా అలాగే ఒక జార్ లో ఉల్లిపాయ ముక్కలను వేసి పేస్ట్ లా చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అందులో పసుపును, ఆవ నూనెను వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మొలలపై రాయాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల నొప్పి తగ్గడంతోపాటు మొలల నుండి కూడా ఉపశమనం కలుగుతుంది. ఎక్కువగా మద్యం సేవించే వారు రోజూ ఒక గ్లాస్ మజ్జిగలో ఒక టీ స్పూన్ పసుపును కలిపి తీసుకోవడం వల్ల కాలేయ ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: