జలుబు, ముక్కుదిబ్బడను తగ్గించే ఈజీ టిప్?

Purushottham Vinay
కాలాలు మారుతున్న కొద్దీ వాతావరణంలో మార్పు చోటు చేసుకున్నప్పుడల్లా మనలో చాలా మంది జలుబు బారిన పడుతుంటారు. జీవితంలో ఎప్పుడో ఒకసారి జలుబు బారిన పడని వారు ఉండరు.సగటున మనిషి ఏడాదికి రెండుసార్లు జలుబుతో బాధపడుతుంటాడని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. జలుబు చేసినట్టుగా అనిపించగానే ముక్కు నుండి నీరు కారడం, తుమ్ములు బయటపడతాయి. జలుబు పది రోగాల పెట్టు అని మన పెద్దలు అంటుంటారు. జలుబు చేయగానే తల నుండి పాదాల వరకు అన్నీ అవయవాలు నొప్పి పెట్టినట్టుగా ఉంటాయి. గాలి ఆడకుండా ముక్కు పెట్టేసినట్టుగా ఉంటుంది. జలుబు రావడానికి కనీసం 200 పైగా వైరస్ లు కారణం అవుతాయట.జలుబు చేస్తే చాలు బాబోయ్ ఇక నరకం అనే చెప్పాలి.ఇక జలుబు చేసినప్పుడు ముక్కు చీదడం, దగ్గు, తుమ్మడం వంటి లక్షణాలు మాత్రం అందరిలో సాధారణంగా ఉంటాయి. జలుబులో బాగా ఇబ్బంది పెట్టే ముక్కు దిబ్బడకు ప్రాచీన ఆయుర్వేదంలో ఒక చిన్న టిప్ ఉంది.ఈ టిప్ గురించి తెలుసుకంటే ఇంత చిన్న టిప్ అని అందరూ ఆశ్చర్యపోతారు.


ముక్కు దిబ్బడ తగ్గడం కోసం ఒక ప్లేట్ మీద రెండు లేదా మూడు కాలుతున్న బొగ్గులను తీసుకోవాలి. దాని పైన వామును కొద్ది కొద్దిగా చల్లాలి.వామును చల్లగానే వచ్చిన పొగను బాగా పీల్చాలి. ఇలా వాము పొగను పీల్చడం వల్ల ముక్కు దిబ్బడ క్షణాల్లో మాయమవుతుంది. శ్వాస బాగా ఆడుతుంది. ఈ వాము పొగను పీల్చడం వల్ల ముక్కులో, ఊపిరితిత్తుల్లో ఉండే కఫం తొలగిపోతుంది. ఇలా వాము పొగను పీల్చడం వీలు కానీ వారు వేడి నీటిలో పసుపు వేసి ఆవిరి పట్టాలి.ఇలా రోజుకు రెండు నుండి మూడు సార్లు చేయడం వల్ల ముక్క దిబ్బడ తగ్గడంతో పాటు జలుబు కూడా తగ్గుతుంది.అదే విధంగా పది చుక్కల తేనెను, పది చుక్కల తులసి ఆకుల రసాన్ని కలిపి రోజుకు మూడు సార్లు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా ముక్కు దిబ్బడతో పాటు జలుబు కూడా తగ్గుతుంది. ఈ సింపుల్ టిప్స్ పాటించడం వల్ల ముక్కు దిబ్బడ అలాగే జలుబు నుండి సత్వర ఉపశమనం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఖచ్చితంగా ఇవి పాటించండి. ఎల్లప్పుడూ కూడా ఆరోగ్యంగా జీవించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: