మధుమేహన్ని కంట్రోల్ లో ఉంచే సింపుల్ టిప్స్?

Purushottham Vinay
మధుమేహంతో బాధపడేవారు తప్పకుండా ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఒత్తిడికి గురవ్వకుండా..టెన్షన్ తో కూడిన పనులకు డయాబెటిస్ ఉన్నవాళ్లు దూరంగా ఉండాలి. ఒత్తిడికి గురికావడం వల్ల రక్తపోటుకు గురయ్యే అవకాశం ఉంది. గుండెపోటు లేదా గుండె సంబంధిత వ్యాధులకు గురయ్యే ఛాన్స్ ఎక్కువుగా ఉంది. అందుకే ఒత్తిడికి లోనుకాకుండా ప్రతిరోజూ 8 గంటలకు తక్కువ కాకుండా నిద్రపోవాలి. మనస్సు రీలాక్స్ గా ఉంచుకునేందుకు సంగీతం వినడం, లు చూడటం వంటివి చూడటం మంచిది.మధుమేహంతో బాధపడేవారు తప్పనిసరిగా తీసుకునే ఆహారంలో సమతుల్యత పాటించాలి. ఎప్పుడు పడితే అప్పుడు ఏ ఆహారం పడితే అది తీసుకోకూడదు. కొవ్వు పదార్థాలు లేని ఆహార పదార్థాలను తీసుకోవాలి. రక్తంలో షుగర్ స్థాయిని పెంచే పదార్థాలు తినకూడదు. రోజులో నాలుగు చపాతీలు ఒకేపూట తీసుకుంటే.. పూటకు రెండు చొప్పున ఒక రోజులో రెండు సార్లు తీసుకోవాలి.డయాబేటిస్ ఉన్న వారు ఆహారంగా తృణధాన్యాలను ఎక్కువుగా తీసుకోవడం మంచిది.


కూరగాయలు, బీన్స్ వంటివి తినాలి. పిజ్జా, బర్గర్లు, నూడిల్స్, పేస్ట్రీలు, అధికంగా కొవ్వు ఉండే జంక్ ఫుడ్ కు మధుమేహం వ్యాధి ఉన్నవాళ్లు దూరంగా ఉండాలి. స్కిన్ లెస్ చికెన్ ను భోజనంతో పరిమితంగా తీసుకొవచ్చు. డయాబెటిస్ ఉన్న వ్యక్తులకు ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే పరిమితంగా తాగాలి.మధుమేహం వ్యాధి ఉన్న వ్యక్తి ప్రతిరోజూ తన దినచర్యలో భాగంగా శారీరక వ్యాయమం చేయాలి. కనీసం 40 నుంచి 45 నిమిషాల పాటు వ్యాయమం చేయడం ద్వారా రక్తంలో షుగర్ స్థాయిని నియంత్రిస్తుంది. వాకింగ్, సైక్లింగ్, రోలర్ బ్లేడింగ్, జాగింగ్, స్విమ్మింగ్, స్కిప్పింగ్ లేదా క్రీడలు ఆడటం వంటి శారీరక వ్యాయమాలు చేస్తే మధుమేహం నియంత్రణలో ఉంటుంది. బరువు అధికంగా పెరగకుండా చూసుకోవడం ద్వారా షుగర్ వ్యాధిని నియంత్రించవచ్చు. ప్రతి రోజు వ్యాయమం చేయడం, సమతూకంలో ఆహారం తీసుకోవడం ద్వారా బరువు తగ్గే ప్రయత్నం చేయాలి. బరువు తగ్గడం కోసం ఎటవంటి ఆహారం తీసుకోకుండా ఉండటం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: