నిమ్మరసం వల్ల కలిగే ప్రయోజనాలు?

Purushottham Vinay
నిమ్మ రసం ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది.భోజనం చేసిన వెంటనే ఎలాంటి శీతల పానీయాలకైనా దూరంగా ఉండాలి. మీరు భోజనం చేసిన వెంటనే ఏదైనా శీతల పానీయం తాగితే కడుపులో గ్యాస్, మలబద్ధకం, ఉబ్బరం వంటి అనేక సమస్యలు వస్తాయి. కావున భోజనం చేసిన వెంటనే నిమ్మరసం తాగకుండా ఉండండి.దీన్ని తీసుకోవడం వల్ల కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది అద్భుతమైన రోగనిరోధక శక్తి పానీయం. ఇది తాగడం వల్ల సీజనల్ ఇన్ఫెక్షన్లు, అలెర్జీలు, జలుబు, జ్వరం మొదలైన వాటి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఆహారం తిన్న తర్వాత నిమ్మరసం తాగితే అది చర్మ సమస్యలను తొలగిస్తుంది. ఇంకా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది కాకుండా బరువు తగ్గడానికి ఇది చాలా మంచి పానీయం.


ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే దీన్ని తీసుకోవడం వల్ల కొద్ది రోజుల్లోనే మీ బరువులో తేడా కనిపిస్తుంది. అయితే.. భోజనం చేయగానే తాగకుండా.. కొద్ది సమయం తర్వాత తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.భోజనం చేసిన తర్వాత కనీసం 45 నిమిషాల పాటు నిమ్మరసం తాగకూడదు. భోజనం చేసిన 1 గంట తర్వాత మాత్రమే ఏదైనా పానీయం తాగడ మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. అంతే కాకుండా భోజనం చేసిన తర్వాత నిమ్మరసం కలిపిన చల్లటి నీళ్లను కూడా ఎప్పుడూ తాగకూడదు. ఎప్పుడూ వేడి నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగాలి.ఇందులో సిట్రిక్ యాసిడ్ కూడా ఉంటుంది. నిమ్మరసం రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు.. ఆరోగ్యానికి అన్ని విధాలా ప్రయోజనాలను చేకూర్చుతుంది. దీనిని క్రమంగా తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది.నిమ్మ నీరు రుచితోపాటు.. అనేక అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది.కాబట్టి నిమ్మరసం ఖచ్చితంగా తాగండి. ఎల్లప్పుడూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా జీవించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: