సీజనల్ వ్యాధులు రాకుండా ఇవి తినండి?

Purushottham Vinay
ప్రస్తుతం వర్షా కాలం కారణంగా డెంగ్యూ, మలేరియా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. అదే విధంగా వేడి, తేలికపాటి శీతాకాలం కారణంగా వైరల్ జ్వరాలు కూడా సంభవిస్తాయి. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో వైరల్ జ్వరాలు, డెంగ్యూ విలయతాండవం చేస్తోంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులు ఈ వ్యాధుల బారిన పడతారు. దీంతో రక్తంలో ఇన్ఫెక్షన్, ప్లెట్ లెట్ కౌంట్ తగ్గిపోవడం లాంటి సమస్యలు వస్తాయి. ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావొచ్చు. ఇలాంటి సందర్భంలో.. ఇంట్లో, మార్కెట్‌లో అమ్మే హెల్తీ కూరగాయలు, పండ్ల రూపంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. పెరుగులో లాక్టిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఇందులో ఉండే బ్యాక్టీరియా ఆహారం జీర్ణం కావడానికి సహకరిస్తుంది. ఇది రోగనిరోధక వ్యవస్థ బాగా పనిచేయడానికి సహాయపడుతుంది. ఇది ప్రోబయోటిక్‌గా పనిచేస్తుంది.ఇంకా బీట్‌రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రోజూ తింటే, హిమోగ్లోబిన్, ప్లేట్‌లెట్ల సంఖ్య వేగంగా పెరుగుతుంది. దీని తాజా రసం రోగికి మేలు చేస్తుంది. మీరు ఇంట్లో సలాడ్ లేదా కూర రూపంలో దీనిని తినవచ్చు.అలాగే దానిమ్మ పండులో పోషకాలు మెండుగా ఉన్నాయి. ఇందులో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. ఇది హిమోగ్లోబిన్, ప్లేట్‌లెట్లను వేగంగా పెంచడానికి పనిచేస్తుంది. దానిమ్మ రసాన్ని ఇంట్లోనే తయారుచేసుకుని తీసుకోవచ్చు. నిల్వ చేసిన రసాన్ని తాగొద్దు.


ఇంకా కివిలో విటమిన్-సి, విటమిన్-ఇ, పాలీఫెనాల్స్ ఉంటాయి. రోజూ ఒక కివిని ఉదయం, సాయంత్రం తినడం వల్ల ప్లేట్‌లెట్స్ వేగంగా పెరుగుతాయి. దీని వల్ల కొలెస్ట్రాల్ కూడా అదుపులో ఉంటుంది. డెంగ్యూ సీజన్‌లో కివీకి డిమాండ్ పెరుగుతుంది.ఇంకా అలాగే బొప్పాయి ఆకుల రసం ప్లేట్‌లెట్లను పెంచడంలో మంచి రెమెడీ. డెంగ్యూ జ్వరంలో బొప్పాయి ఆకు అద్భుతమైన ఔషధమని  పరిశోధనలో వెల్లడైంది.తిప్పతీగ ఆకుల రసం లేదా నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల వైరల్ ఫీవర్ రాదు. డెంగ్యూలో వేగంగా ప్లేట్‌లెట్స్ కౌంట్ కూడా తగ్గదు. డెంగ్యూ జ్వరం నుంచి కూడా కోలుకోవచ్చు. తిప్పతీగ ఆకులను ఉడకబెట్టి వడగట్టి కూడా తాగవచ్చు.ఇంకా రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు వెల్లుల్లిలో చాలా పుష్కలంగా ఉన్నాయి. ఇది వాపు, జ్వరం, గొంతు నొప్పిని తొలగిస్తుంది. అలాగే యాంటీమైక్రోబయల్, యాంటీ ఫంగల్ లక్షణాలు చెడు జెర్మ్స్, టాక్సిన్‌లను బయటకు పంపుతాయి. రెండు వెల్లుల్లి రెబ్బలను వేడి నీళ్లతో కలిపి తీసుకుంటే కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, కీళ్ల నొప్పులు ఇంకా గుండెకు కూడా మేలు జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: