అధిక కొలెస్ట్రాల్ ను తగ్గించే అద్భుతమైన ఔషధం..!!

Divya
ఇటీవల కాలంలో చాలామంది ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాటిలో అధిక కొలెస్ట్రాల్ కూడా ఒకటి. అధిక కొలెస్ట్రాల్ మన శరీరంలో పేరుకుపోవడం వల్ల మధుమేహం, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక సమస్యలు ఎక్కువవుతాయి. అటువంటి పరిస్థితుల్లో మీరు కొవ్వు పదార్థాలు కలిగిన తీపి ఆహారాన్ని మినహాయించి ఆరోగ్యకరమైన ఆహారాన్ని దినచర్యలో చేసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా కొత్తిమీర అనేది ఒక హెర్బ్ .. దీని సహాయంతో వంటకాలు రుచిని మెరుగుపరుచుకోవచ్చు. అంతేకాదు ఎక్కువగా అలంకరణగా వస్తువుగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇక మరొకవైపు కొత్తిమీర గింజలు అంటే ధనియాలను మసాలాగా ఉపయోగిస్తారు. ఇక ధనియాల పొడిని మసాలాలలో ఉపయోగిస్తూ వంటకు మంచి రుచిని తీసుకొస్తూ ఉంటారు.

ముఖ్యంగా ధనియాలలో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.  వీటిని తినడం వల్ల మన శరీరానికి విటమిన్ ఎ,  విటమిన్ సి , యాంటీ ఆక్సిడెంట్,  బీటా కెరోటిన్ లభిస్తాయి.  ముఖ్యంగా ధనియాలను ప్రతిరోజు మూడు నిమిషాలపాటు ఒక చెంచా గింజలను నీటిలో నానబెట్టి దానిని ఫిల్టర్ చేసి తాగడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి చాలా వరకు తగ్గుతుంది. ముఖ్యంగా కొత్తిమీర గింజలు మన ప్రేగులకు లైఫ్ సేవర్ గా పనిచేస్తాయి. గ్యాస్,  డయేరియా,  మలబద్ధకం,  ఉబ్బరం, కడుపులోని ఆమ్లత్వం నుండి కూడా ఉపశమనం లభిస్తుంది.కొత్తిమీరలో ఉండే ఫైబర్, యాంటీ యాక్సిడెంట్ శరీరానికి మంచి చేకూరుస్తాయి.

మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా బాగా సహాయపడతాయి.  ముఖ్యంగా ధనియాల సహాయంతో కొలెస్ట్రాల్ ను తగ్గించవచ్చు.  కాబట్టి ఇది డయాబెటిక్ రోగులకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. కాబట్టి రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది. చర్మం లేదా జుట్టుకు సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే కొత్తిమీరను తినవచ్చు.  అంతేకాదు ఇందులో ఉండే విటమిన్ బి ,విటమిన్ కె , విటమిన్ సి వంటి అనేక ఖనిజాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇక ధనియాలు ఎంతో ఆరోగ్య ప్రయోజన కారిగా పనిచేస్తాయి. కాబట్టి తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలను పొందడంతో పాటు చెడు కొలెస్ట్రాల్ ను కూడా దూరం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: