తలనొప్పి తగ్గాలంటే ఈ చిట్కాలు పాటించండి..!!

Divya
ప్రతి ఒక్కరికి సర్వసాధారణంగా తలనొప్పి రావడం జరుగుతుంది. అయితే ఆ తలనొప్పి ఒక్కొక్కసారి చాలా చికాకుగా కూడా అనిపిస్తుంది. ఈ బాధతో ఒక్కసారి కొంతమంది చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరి కొంతమంది చికిత్స తీసుకున్నా కూడా ఈ మైగ్రేన్ సమస్య పూర్తిగా తగ్గదని చెప్పవచ్చు. తలనొప్పి వస్తుందంటే చాలు ఎక్కువగా అమృతాంజన్, జండూబామ్ వంటివి ఉపయోగిస్తూ ఉంటారు. దీనివల్ల తాత్కాలికంగా ఉపశమనం మాత్రమే పొందుతారు అయితే ఏదైనా పనిలో ప్రెజర్ వల్ల తలనొప్పి వచ్చినప్పుడు పలు సమస్యలు ఎదురైనప్పుడు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. అయితే ఇలాంటి సమయంలో కొన్ని చిట్కాలను పాటిస్తే వీటి నుంచి ఉపశమనం పొందవచ్చు. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1). ముఖ్యంగా శరీరంలో నీరు లేకపోతే తలనొప్పి కి కారణమవుతుందని వైద్యులు సూచిస్తున్నారు. అందుచేతనే ప్రతి ఒక్కరు కూడా నీటిని తగినంత తీసుకోవడం మంచిది.

2). తలనొప్పికి సాధారణంగా అదుపులోకి రావడానికి ఆ సమయంలో మనం తలనొప్పిస్తున్న సమయంలో ఫుడ్ తీసుకోకుండా ఏదైనా జీర్ణం అయ్యే పదార్థాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం.  లేదంటే మైగ్రేన్ సమస్య చాలా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

3). మార్కెట్లో దొరికేటువంటి లావెండర్ ఆయిల్ పీల్చడం వల్ల మైగ్రేన్ సమస్యను కాస్త అరికట్టవచ్చు. కాస్త తలనొప్పిగా అనిపిస్తున్న సమయంలో వెంటనే లావెండర్ నూనెను వాసన చూడటం వల్ల కాస్త ఫ్రెష్ గా ఫీల్ అవుతారు.
4). ముఖ్యంగా ప్రతి ఒక్కరికి సాధ్యమైన పని.. తలనొప్పి వచ్చినప్పుడు యోగా చేయడం. యోగా చేయడం వల్ల శ్వాస వ్యాయాయాలు ధ్యానం మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీంతో తలనొప్పి తగ్గుతుందని కొంతమంది పరిశోధకులు ఈ విషయాన్ని తెలియజేశారు.

5). తలనొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు మసాజ్ చేయించుకోవడం మంచిది..ముఖ్యంగా మెడ, భుజ కండరాలు మసాజ్ చేసుకోవడం వల్ల కాస్త రిలాక్స్ గా ఫీల్ అవుతారు. ఇలాంటివి చేయడం వల్ల తలనొప్పిని తగ్గించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: