జలుబు, దగ్గు, జ్వరం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు?

Purushottham Vinay
ఇప్పుడిక ఈ సీజన్ లో వాతావరణంలో మార్పులు అనేవి ఏర్పడతాయి. ఉష్ణోగ్రతలో మార్పు కారణంగా.. జలుబు, ఫ్లూ, ఇతర సీజనల్ ఆరోగ్య సమస్యలతో బారిన పడే ప్రమాదం ఉంది.వాతావరణం మారినప్పుడు ఒకొక్కసారి మరింత అధికంగా జలుబు బారిన పడిన సందర్భాలు ఉన్నాయి. ఇలా జరగడానికి ఒక కారణం ఉంది. సీజన్ మారిన ప్రతిసారీ, వాతావరణంలోని అలెర్జీ కారకాల సంఖ్య గాలిలో దాదాపు 200 వైరస్‌లు వ్యాపిస్తాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నారు ఉష్ణోగ్రతలో మార్పులతో అనారోగ్యం బారిన పడతారని నిపుణులు అంటున్నారు.ఉష్ణోగ్రతలో స్వల్ప మార్పు కూడా వారికి కష్టతరంగా మారుతుంది. దగ్గు, జలుబు , వైరల్ ఫీవర్ వంటి సాధారణ సమస్యల బారిన పడవచ్చు అన్నారు.వృద్ధులకు, చిన్న పిల్లలో అయితే ఆరోగ్యం పరిస్థితి మరింత దిగజారుతుంది.సమతుల ఆహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం, ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడం వంటివి సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ ఇస్తుంది.క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వ్యక్తుల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అందువలన వైరల్ ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం తక్కువ.


వైరస్ లు శరీరం వెలుపల 3 గంటల వరకు జీవించగలవు. కొన్నిసార్లు డోర్ నాబ్‌లు లేదా లైట్ స్విచ్‌లు వంటివి చేతులతో తాకిన వస్తువులపై 48 గంటల వరకు జీవించగలవు. అందువల్ల.. సీజనల్ వ్యాధుల వ్యాప్తి ప్రమాదాన్ని నివారించడానికి మీరు మీ చేతులను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అంతేకాదు చేతులను ముఖాన్ని తాకించుకోకుండా చూసుకోవాలి.జలుబు, ఫ్లూ నేడు సాధారణ ఆరోగ్య సమస్యలు అయినప్పటికీ.. ప్రారంభంలో జాగ్రత్త తీసుకోకపోతే ఆరోగ్యానికి హానికరంగా మారవచ్చు. బాధితులు ఆసుపత్రిలో కూడా చేరవలసి ఉంటుంది. అయితే కొన్ని జాగ్రత్తలు, జీవనశైలిలో మార్పులు చేసుకుంటే సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.కాబట్టి ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించండి. జలుబు, దగ్గు, జ్వరం లాంటి రోగాల బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఎల్లప్పుడూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా జీవించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: