ఉసిరికాయ నీటి వల్ల ఇన్ని లాభాలా..?

Divya
ఉసిరికాయలలో ఏన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది మన శరీరానికి పలు రకాలుగా మేలు చేయడమే కాకుండా ఎన్నో ఔషధ గుణాలను కూడా లభించేలా చేస్తుంది.. అందుచేతన ఉసిరికాయ ఎన్నో ఆయుర్వేదం వంటి వాటిల్లో కూడా వేస్తూ ఉంటారు. ఇక జుట్టు సంరక్షణ వంటి వాటిలో కూడా ఎంతో సహాయపడుతుంది ఉసిరికాయలు. ఇంకా ఈ కాయలు పలు రకాలుగా మనకు ఉపయోగపడతాయి అందుచేతనే కనీసం వారానికి ఒకటైన తినమని వైద్యులు కూడా సలహా ఇస్తూ ఉంటారు. ఉసిరికాయలు పచ్చడి ఉసిరి రసం ఇలా అనేక రకాలుగా చేసుకొని తింటూ ఉండవచ్చు.అయితే ఉసిరికాయల పొడి కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుందని కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు. పరగడుపున వీటిని తాగినట్లు అయితే ఎన్నో పోషకాలు కూడా అందుతాయి. అయితే ఇప్పుడు మనం ఉసిరి నీటిని ఎలా తయారు చేసుకోవాలి వాటి యొక్క ప్రయోజనాలను ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.

ఉసిరికాయ నీటిని ఉదయం తాగితే జీర్ణ సమస్యకు సంబంధించి సమస్యలు కూడా తొలగిపోతాయి. అయితే మలబద్ధక సమస్య అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఉసిరి నీటిని తాగడం మంచిది.
ఉసిరి నీరు జుట్టుకు కూడా చాలా మేలు చేస్తుంది ఇందులో ఉండే ఆమ్లనీరు రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు మన శరీరంలో ఉండే విషం మలినాలను కూడా  తొలగిస్తుంది దీనివల్ల మన ముఖంలో చాలా గ్లో వస్తుంది.. అంతేకాకుండా మొటిమలు, మచ్చలతో ఇబ్బంది పడుతున్న వారు ప్రతిరోజు ఒక ఉసిరి పండు తింటే వీటితోపాటు చుండ్రు సమస్య జుట్టు రాలే సమస్య కూడా దూరమవుతుంది.

ఇక ప్రతిరోజు ఉసిరికాయ నీటిని తాగితే జీర్ణక్రియ వేగవంతం అవ్వడం వల్ల ఆహారాన్ని ఎక్కువగా తినకుండా చేస్తుంది దీంతో బరువు తగ్గుతారు.
ఉసిరికాయలను బాగా ఆరబెట్టి వాటిని మిక్సీకి వేసి .. ఆ పొడిని ప్రతిరోజు నీటిలో కలిపి తాగడం వల్ల పలు  ఉపయోగాలు ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: