కంటి చూపుని మెరుగు పరిచే చిట్కాలు?

Purushottham Vinay
ఇక నేటి కాలంలో కంటి సంబంధిత సమస్యలతో చాలా మంది చాలా బాధపడుతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ కంటి సమస్యల బారిన పడుతున్నారు. కళ్లు మసక బారినట్టు ఉండడం, చిన్న అక్షరాలు కనిపించకపోవడం, దూరంగా ఉన్న వస్తువులను చూడలేకపోవడం, కళ్లు ఎర్రగా మారడం, కళ్ల నుండి నీరు కారడం వంటి సమస్యలతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతుంది. ఇలాంటి కంటి సమస్యలను కొన్ని చిట్కాలను ఉపయోగించి నయం చేసుకోవచ్చు.కంటి చూపును మెరుగుపరచడంలో కుంకుమ పువ్వు అద్భుతంగా పని చేస్తుంది. వేడి నీటిలో ఒక గ్రాము కుంకుమ పువ్వును వేసి చల్లగా అయ్యే వరకు ఉంచాలి. తరువాత ఈ నీటిలో ఒక టీ స్పూన్ తేనెను కలిపి రాత్రి పడుకునే ముందు తాగాలి. ఇలా చేయడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. అదే విధంగా యాలకులు, బాదం, పిస్తా పలుకులు కూడా కంటిచూపును మెరుగుపరుస్తాయి. యాలకులను, బాదం పప్పును, పిస్తా పలుకులను నీటిలో నానబెట్టి తరువాత పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ను పాలల్లో వేసి వేడి చేయాలి. ఇవి కొద్దిగా వేడయ్యాక పటిక బెల్లాన్ని వేసి మరింత కొద్దిసేపు వేడి చేయాలి. ఇలా తయారు చేసుకున్న పాలను క్రమం తప్పకుండా తాగడం వల్ల కంటి సమస్యలు తొలగిపోయి కంటి చూపు మెరుగుపడుతుంది.


క్యారెట్ జ్యూస్ ను రెండు నెలల పాటు తీసుకోవడం వల్ల కూడా రక్తవృద్ధి జరిగి కంటి చూపు మెరుగుపడుతుంది. అదేవిధంగా కంప్యూటర్ లపై పని చేసే వారు వాటిని తదేకంగా చూడకుండా కళ్లను మూస్తూ తెరుస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల కూడా కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. కంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఒమెగా3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే చేపలను ఎక్కువగా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా చక్కటి కంటి చూపును సొంతం చేసుకోవచ్చు. ఇవి అన్నీ చేస్తూనే కళ్లలోకి దుమ్ము, ధూళి, వాహనాల పొగ చేరకుండా చూసుకోవాలి.కంటి చూపును మెరుగుపరచడంలో బాదం నూనె ఎంతో ఉపయోగపడుతుంది. దీని కోసం ఒక గిన్నెలో బాదం నూనెను తీసుకుని రెండు చూపుడు వేళ్లతో నూనెను తీసుకుని కను రెప్పలపై రాస్తూ మర్దనా చేయాలి. తరువాత కళ్లు మూసుకుని కళ్లపై రెండు కీరదోస ముక్కలను ఉంచాలి. ఇలా చేసిన పావు గంట తరువాత కీరదోస ముక్కలను తొలగించి కళ్లను శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల కళ్లకు రక్తప్రసరణ మెరుగుపడి కంటిచూపు పెరుగుతుంది. ఇలా క్రమం తప్పకుండా రోజూ చేస్తూ ఉండడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు.కాబట్టి ఈ చిట్కాలు పాటించండి. కంటి చూపును మెరుగుపరచుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: