దగ్గు వస్తోందా అయితే ఇలా చేయండి..?

Divya
అప్పుడప్పుడు దగ్గడం వలన శ్వాసనాళాలు శుభ్రం అవుతూ ఉంటాయి. గొంతులో పేరుకుపోయిన ప్లేస్మం వల్లే దగ్గు రావడం జరుగుతుందట. అయితే వరుసగా చాలా రోజులు కొనసాగితే మాత్రం ఇది ఆరోగ్యానికి చాలా హానికరం కలిగిస్తుంది. పొడి దగ్గు సమస్య వీటి ద్వారానే ఎక్కువగా వస్తుందట. ఈ పొడి దగ్గు నిద్రను బంగం కూడా కలిగిస్తుంది.అంతేకాకుండా ఛాతీ నొప్పి కూడా కలిగించేలా చేస్తుంది. అయితే ఇలాంటి వాటికి మనం ఇంటి నివారణలతోనే చెక్ పెట్టవచ్చు వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1). బెల్లం వినియోగం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఇది కేవలం సహజమైన చెక్కర ద్వారానే తయారు చేయడం జరుగుతుంది. దీని కారణంగానే మన శరీరంలోని ఉండే రక్తం గ్లూకోజ్ స్థాయిని పెరగకుండా చేస్తూ ఉంటుంది. అయితే పొడి దగ్గు వచ్చేవారు ఒక గిన్నెలో కాస్తా బెల్లాన్ని వేడి చేసి అందులో కొద్దిగా అల్లాన్ని కలపడం వల్ల ఈ సమస్య నుంచి దూరం కావచ్చు.

2). దగ్గు సమస్య మరింత ఎక్కువగా ఉండేవారు.. నల్ల మిరియాలు కాస్త ఉప్పును బాగా నూరిన తర్వాత అప్పుడు తీసుకొని రాత్రి పడుకునే ముందు ఈ మిశ్రమాన్ని తిన్నట్లు అయితే పొడి దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు.

3). ఇక గోరువచ్చని నీటిలోకి కాస్త తేనెను కలిపి తాగడం వల్ల దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు. అయితే వీటిని కేవలం రాత్రి సమయాలలోనే తాగాలి. అయితే ఈ వేడి నీటి వల్ల గొంతు సమస్యలు తొలగిపోయి.. దగ్గు సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు

4). ముఖ్యంగా అందరికీ అందుబాటులో ఉండేది తులసి ఆకులు వీటి వల్ల కూడా దగ్గుకి దివ్య ఔషధంగా పనిచేస్తుంది. అంతే కాకుండా జలుబు లక్షణాలు వంటి వి తగ్గించడంలో ఇవి చాలా సహాయపడతాయి. తులసి ఆకులకు కాస్త తేనెను కలిపి తింటూ ఉండడం వల్ల దగ్గు సమస్యను పూర్తిగా దూరం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: