బరువు తగ్గాలంటే అన్నంలో ఇది మిక్స్ చేసి తినండి?

Purushottham Vinay
ఇక ప్రస్తుత కాలంలో పూర్తిగా మారిన జీవనశైలి, వ్యాయామం చేయకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి ఇంకా అలాగే జంక్ ఫుడ్ ఎక్కువగా తినటం వంటి అనేక రకాల కారణాలతో అధిక బరువు సమస్య అనేది ఈ మధ్య కాలంలో అందరిలో కూడా చాలా ఎక్కువగా కనబడుతుంది.అయితే అధిక బరువు సమస్య ఉన్నప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు.మనలో చాలా మంది కంగారుపడి మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. అలా వాడటం వలన తాత్కాలికంగా ఫలితం కనిపించిన సరే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన ఇంటిలో సహజసిద్ధంగా ఉండే పదార్థాలతో చాలా సులభంగా శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించుకొని అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు.దీని కోసం మనం ఒక పొడి తయారు చేసుకోవాలి. కరివేపాకు బరువు తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది. మనం ప్రతి రోజు కూరల్లో కరివేపాకు వేసుకుంటూ ఉంటాం. రెండు కప్పుల కరివేపాకును తీసుకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టాలి.


ఒక పాన్ లో ఆరిన కరివేపాకు వేసి వెగించి పక్కన పెట్టాలి.ఆ తర్వాత అదే పాన్ లో ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మిరియాలు వేసి వేగించి పక్కన పెట్టాలి. ఆ తర్వాత అదే పాన్ లో నాలుగు స్పూన్ల ఆవిసే గింజలు వేసి వేగించాలి. మిక్సీ జార్ లో వేగించి పెట్టుకున్న కరివేపాకు, జీలకర్ర, మిరియాలు, అవిసె గింజలు, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి.ఈ పొడిని గాజు సీసాలో నిలువ చేసుకొని ప్రతిరోజు భోజనం చేసే సమయంలో మొదటి ముద్ద ఈ పొడితో తింటే శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. లేదంటే ఒక గ్లాసు మజ్జిగలో అర స్పూన్ పొడి వేసుకుని కలిపి తాగవచ్చు. కాస్త ఓపికగా ఇటువంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు.కాబట్టి ఖచ్చితంగా అధిక బరువు సమస్యతో బాధపడేవారు ఇలా ఈ పొడి తయారు చేసుకోని మీ మొదటి ముద్దలో కలుపుకొని తినండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: