పుట్టగొడుగులు ఎక్కువగా తింటున్నారా ..తస్మాత్ జాగ్రత్త..!

Divya
ఈమధ్య కాలంలో తీసుకునే ఆహారం విషయంలో అలాగే ఆరోగ్యం పట్ల చాలామంది శ్రద్ధ పెడుతున్నారు.. కారణం కరోనా అని చెప్పవచ్చు. కరోనా వచ్చిన తర్వాత చాలామంది ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్న నేపథ్యంలో ఒకప్పుడు తినని ఆహార పదార్థాలను కూడా ఈ మధ్య తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇక ఈ క్రమంలోని ఒకప్పుడు పుట్టగొడుగులు అంటే తినే వారు చాలా తక్కువగా ఉండేవారు. అంతేకాదు వీటిని తినడానికి ఎక్కువగా ఆసక్తి కూడా చూపించేవారు కాదు. పుట్టగొడుగుల్లో ఉండే ప్రయోజనాల గురించి తెలుసుకుంటే కచ్చితంగా వాటిని ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. పుట్టగొడుగుల్లో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఇక ఇది ఎముకలను బలంగా ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఎముకల బలహీనత, కండరాల దృఢత్వం లేని వారు పుట్టగొడుగులను తినడం వల్ల సమస్య తీరిపోతుంది.

ఇక బరువు తగ్గాలని డైట్ మెయింటైన్ చేసే వారు కూడా పుట్ట గొడుగులను చాలా బాగా తినవచ్చు. ఇవి మీ బరువును తగ్గించడంలో సహాయపడతాయి. ఆకలిని తగ్గించి ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోకుండా మిమ్మల్ని కాపాడతాయి. కాబట్టి రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే శరీరానికి అవసరమైన విటమిన్ డి కూడా లభిస్తుంది. ఇక వీటిలో మాంసం కృతులు ఎక్కువగా,  పిండి పదార్థం తక్కువగా ఉండటం వల్ల షుగర్ పేషెంట్లు కూడా పుష్కలంగా తినవచ్చు ఇకపోతే పుట్టగొడుగుల్లో ఉండే పొటాషియం పక్షవాతాన్ని నియంత్రిస్తుంది.

ఇక అంతేకాదు రక్తపోటు నియంత్రణలో ఉంచడానికి పుట్టగొడుగులు రక్త ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా జరిగేలా చేసి , చెడు కొలెస్ట్రాలను తొలగించి గుండెను సంరక్షిస్తాయి. ఐరన్ సమృద్ధిగా లభించడమే కాదు యాంటీ ఆక్సిడెంట్ గా కూడా పనిచేస్తుంది ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది ముఖ్యంగా పొట్ట సంబంధిత సమస్యలు కూడా దూరం అవుతాయి . అయితే పుట్టగొడుగుల్లో పోషకాలు ఎక్కువగా ఉన్నాయని అధికంగా తింటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది. అతిగా తినడం వల్ల విరోచనాలు , వాంతులు,  వికారం వంటి సమస్యలు ఎక్కువ అవుతాయి. పుట్టగొడుగులు తినే మోతాదును తగ్గించుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: