కోడిగుడ్లను ఎక్కువ తింటున్నారా అయితే ప్రమాదమే నా..!!

Divya
పౌష్టికాహారం తినాలనుకునేవారు ఎక్కువగా కోడిగుడ్లు తింటూ ఉంటారు. సాయంత్రం ఎక్కువగా స్నాక్స్ రూపంలో కోడిగుడ్లను తింటూ ఉంటారు. ప్రతిరోజు ఒక గుడ్డును తినాలని సూచిస్తూ ఉన్నప్పటికీ.. వీటిని మాత్రం తగిన మోతాదులలో తీసుకుంటూ ఉండాలి. వీటిని ఎక్కువగా తినడం మంచిది కాదని వైద్యులు కూడా హెచ్చరిస్తూ ఉంటారు. అయితేనే గుడ్డు హెల్తీ ఫుడ్ అని అంటూ ఉంటారు. ఇందులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా గుడ్డును ఉడకబెట్టి తింటే ప్రతిరోజు కూడా చాలా ఎనర్జీగా , ఎంతో హుషారుగా ఉంటారు. అయితే ఇంతవరకు బాగుంది అసలు ప్రతిరోజు ఎన్ని గుడ్లు తినాలి ఒకవేళ గుడ్లను ఎక్కువగా తింటే ఏమవుతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ప్రతిరోజు కేవలం ఒక గుడ్డును మాత్రమే తింటే సరిపోతుంది ఇలా తినడం వల్ల అతని శరీరానికి ఎన్నో పోషకాలు అందడమే కాకుండా జీవన శైలి కూడా చాలా బాగుంటుందని వైద్యులు తెలియజేస్తున్నారు. ప్రతిరోజు రెండు కంటే ఎక్కువ గుడ్డు తిన్నట్లు అయితే కచ్చితంగా వ్యాయామం చేయాలి లేదంటే ప్రోటీన్లు ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంటుంది దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.

ఆరోగ్యానికి మేలు చేసే ఈ గుడ్లను ఎక్కువ మోతాదులో తిన్నట్లు అయితే ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లేనట.. గుడ్డును పరిమితి నుంచి తింటే డయేరియా బారినా పడే అవకాశం ఉంటుంది. దీనివల్ల శరీరం చాలా బలహీనంగా ఉంటుంది. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థ పై కూడా చెడు ప్రభావం పడుతుంది. ఇక కొన్ని సందర్భాలలో కడుపులో చికాకుగా ఉండడమే కాకుండా గ్యాస్టిక్ సమస్యలు కూడా వస్తాయి.
కోడిగుడ్డులో ఎక్కువగా కొవ్వు పదార్థాలు ఉంటాయి ముఖ్యంగా కోడిగుడ్డులో ఉండే పచ్చ సొన లో అధిక కొవ్వు ఉంటుంది ఇది శరీరానికి చాలా హాని కలిగిస్తుంది అందుచేతనే కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలనుకునేవారు కోడిగుడ్లు తక్కువ మొత్తంలో తింటూ ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: