ఇలా చేస్తే గొంతు సమస్యలన్నీ మాయం?

Purushottham Vinay
 చలి,మంచు కారణంగాను, ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో దగ్గు,జలుబు,గొంతు నొప్పి వంటివి ఎక్కువగా వస్తున్నాయి.ఇంకా అలాగే గొంతులో కిచ్ కిచ్,గరగర, గొంతు నరాల నొప్పి ఇంకా అలాగే గొంతు ఇన్ ఫెక్షన్ వంటివి కూడా వరుసగా వచ్చేస్తాయి. ఈ సమస్యలు ప్రారంభంలో ఉంటే ఇంటి చిట్కాలు అనేవి చాలా బాగా పనిచేస్తాయి.ఈ సమస్య తీవ్రంగా కనుక ఉంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ ని సంప్రదించి డాక్టర్ చెప్పిన సూచనలను పాటిస్తూ ఇంటి చిట్కాను ఫాలో అయితే చాలా తొందరగా మీకు ఫలితం వస్తుంది. దీని కోసం పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి కొంచెం వేడి అయ్యాక అరచెక్క నిమ్మరసం ఇంకా పావు స్పూన్ మిరియాల పొడి వేసి మూడు నిమిషాలు మరిగించాలి.మరిగిన ఈ నీటిని గ్లాస్ లో పోసి అరస్పూన్ తేనె కలిపి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. ఈ నీటిని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి తాగితే చాలా తొందరగా గొంతు సమస్యలు అన్ని తొలగిపోతాయి.


అలాగే ఈ నీటిని తాగుతూ మరొక చిట్కాను కూడా ఫాలో అయితే ఇంకా తొందరగా ఉపశమనం కలుగుతుంది.ఇంకా అలాగే ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో అరస్పూన్ గరుగు ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ ఉప్పు నీటిని గొంతులో పోసుకుని పుక్కిలించడం వల్ల గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇప్పుడు చెప్పిన రెండు చిట్కాలను పాటిస్తే చాలా తొందరగా గొంతుకి సంబందించిన సమస్యలు తగ్గుతాయి. నిమ్మకాయ,మిరియాలు,తేనెలో ఉన్న లక్షణాలు తొందరగా ఉపశమనం కలిగిస్తాయి.ఈ సీజన్ లో వచ్చే సమస్యలను తగ్గించుకోవటానికి ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. కాస్త ఓపికగా సమయాన్ని కేటాయించి చేస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సమస్యల నుండి బయట పడవచ్చు. తేనె,నిమ్మరసం,మిరియాలు ఈ మూడు మనకు సులభంగానే అందుబాటులో ఉంటాయి.కాబట్టి ట్రై చేసి చూడండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: