ఇలా చేస్తే మీ అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు ?

VAMSI
ఈ మధ్య కాలంలో అధిక బరువు అనేది దాదాపుగా చాలా మందికి భరించలేని సమస్య అనే చెప్పాలి. ఎందుకంటే ఎక్కువ మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. బరువు అయితే ఈజీగా పెరిగిపోతున్నారు. కానీ ఆ పెరిగిన బరువును తగ్గించుకోవడానికి మాత్రం నానా తంటాలు పడుతున్నారు. అయినా అందరికీ ఆశించిన ఫలితం తగ్గడం లేదనే చెప్పాలి. ముఖ్యంగా 35, 40 ఏళ్ల వయసు దాటితే చాలా మంది అధిక బరువు సమస్య బారిన పడుతున్నారు. అయితే బరువు తగ్గించుకోవడానికి సరైన పద్దతి అలాగే క్రమంగా వాటిని పాటించడం అనేది కనుక చేస్తే బరువు తగ్గడం అనేది పెద్ద సమస్య కాదు.
ఇపుడు అతి తక్కువ రోజుల్లోనే  బరువు తగ్గడం ఎలా అన్న దాని గురించి  కొందరు నిపుణులు చెప్పిన సలహాల గురించి తెలుసుకుందాం.
ముందుగా జీర్ణక్రియ అనేది సక్రమంగా పనిచేయడం అనేది చాలా కీలకం. ఇందుకు  సహకరించే  గ్రీన్ టీ ని మీ డైట్ లో చేర్చుకోవడం మంచిది అని చెబుతున్నారు. ఒక రోజుకు 3 లేదా 4 కప్పుల గ్రీన్ టీ ని క్రమం తప్పకుండా  తాగడం వల్ల శరీర బరువు తగ్గించడమే కాకుండా, ఒకవేళ అధిక రక్తపోటు ఉన్న వారికి కూడా మంచిదన్నది ఆరోగ్య నిపుణుల అభిప్రాయం. అదే విధంగా అధికంగా నీటిని తీసుకోవాలి అని నిపుణులు అంటున్నారు. ఏదో నామమాత్రంగా నీటిని తీసుకుంటే జీర్ణక్రియ కూడా సక్రమంగా పనిచేయదట, అంతే కాకుండా నీరు శరీరానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. శరీరాన్ని ఫిట్‌గా ఉంచడం లో నీరు ప్రత్యేక పాత్రను పోషిస్తుందట.
 
అదే విధంగా వ్యాయామం క్రమం తప్పకుండా చేయడం కూడా చాలా చాలా ముఖ్యం అని నిపుణులు సూచిస్తున్నారు.  అలాగే ఫాస్ట్ ఫుడ్ ని తినడం తగ్గించాలి.. లా వీటిని పాటిస్తే వారం, పది రోజుల్లోనే మీ శరీర బరువు తగ్గిపోతుంది అని చెప్పడం లేదు కానీ... శరీరం తేలికగా అనిపిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ క్షణం నుండి మీరు కూడా పైన చెప్పిన విధంగా డైట్ ను సర్దుబాటు చేసుకుని అధిక బరువు నుండి అతి తక్కువ సమయంలో ఉపశమనం పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: