వర్క్ ఫ్రం హోమ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఇవి తినాలి?

Purushottham Vinay
ఇక దేశ వ్యాప్తంగా కూడా కరోనా మరొకసారి కోరలు చాస్తోంది. ఈ కరోనా మహమ్మారి రోజురోజుకి చాప కింద నీరులా విస్తరిస్తోంది. అయితే కరోనా మహమ్మారి మొదటి వేవ్ మొదలైనప్పటి నుంచి కూడా ప్రైవేట్ కంపెనీలు అలాగే కొన్ని గవర్నమెంట్ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ నీ కూడా ఇచ్చాయి.ఉద్యోగులు అందరూ కూడా ఇంటి దగ్గర ఉండి చేయడంతో పని వేళలు చాలా ఎక్కువ అయ్యాయి. అయితే ఇక ఇటువంటి సమయంలో ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలో ఇప్పుడు ఇక మనం తెలుసుకుందాం..ఇంట్లోనే ఎక్కువసేపు కూర్చొని ఉండటం ఇంకా అలాగే మానిసిక ఒత్తిడి పెరగడం తదితర కారణాలతో అనేక రకాల అనారోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా తలెత్తుతున్నాయి. అయితే వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేసేవాళ్లు వీలైనంతగా లైట్‌ ఫుడ్‌ తీసుకోవడం చాలా మంచిందని చెబుతున్నారు వైద్యులు. ప్రోటీన్లు ఇంకా అలాగే విటమిన్‌ ఫుడ్‌ ఉండేలా చూసుకోమని డైటీషియన్లు చెబుతున్నారు. 


ఇక కరోనా మహమ్మారి లాంటి సమయంలో డ్రై ఫ్రూట్స్ వంటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం శరీరానికి చాలా అవసరం.ఇవి ఆకలిని తీర్చడంతో పాటు బాడీలోని చెడు కొవ్వును కూడా చాలా ఈజీగా తగ్గిస్తాయి. ఇంకా అలాగే బఠాణీల్లో ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్ ఇంకా మినరల్స్ చాలా ఉంటాయి. ఇంకా అలాగే మన శరీరానికి అవసరమైన అమైనో యాసిడ్స్ బఠాణీల్లో ఉంటాయి. ఇంకా కేలరీలు కూడా తక్కువే. తక్కువ ఫ్యాట్ ఉండే మిల్క్ ఇంకా ఎక్కువ కోకో ఉన్న డార్క్ చాకొలెట్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఎక్కువ పని ఒత్తిడిలో ఉండి అలసిపోయినప్పుడు ఓ డార్క్ చాకొలెట్ తింటే చాలు వెంటనే మీ మూడ్ మారుతుందట. ఈ చాకొలెట్లు అప్పడప్పుడు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. అలా అని ఎక్కువగా తింటే మాత్రం ఖచ్చితంగా బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: