నల్ల మిరియాలతో ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

Divya
వంటకాలలో మసాలా దినుసులలో ఎక్కువగా నల్ల మిరియాలను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ నల్ల మిరియాల వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ నల్ల మిరియాలు ప్రపంచవ్యాప్తంగా పలు ఆహారములలో ఉపయోగించి మసాలా దినుసు మాత్రమే కాకుండా సుగంధ ద్రవ్యాల రాజు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇవి అనేక వంటకాల తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి వంటల రుచిని త్వరగా పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగించేలా చేస్తాయి. వీటివల్ల ఎన్నో రకాల జబ్బులు కూడా దూరం అవుతాయి. అయితే ఇప్పుడు నల్ల మిరియాలు చేసే మేలు గురించి తెలుసుకుందాం.

నల్ల మిరియాలు శరీర రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఇందులో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా విటమిన్ -A,C, K పుష్కలంగా లభిస్తాయి. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమెంటరీ లక్షణాలు చాలానే ఉంటాయి. ఇవి ఉండడం వల్ల మనకి  ఏదైనా గాయాలు తగిలినప్పుడు ఇన్ఫెక్షన్ కాకుండా..నల్ల మిరియాలు జలుబు మరియు దగ్గును తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది.
నల్ల మిరియాల లో క్రియాశీల పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యమైన జీవ శైలిని నడిపించడంలో చాలా సహాయపడతాయి కీళ్ల నొప్పులను తగ్గించడంలో ఈ నల్ల మిరియాలు చాలా సహకరిస్తాయి.
పోషకాహార నిపుణులు తెలిపిన ప్రకారం నల్లమిరియాలు  పసుపు తో కలిపి తీసుకోవడం వల్ల క్యాన్సర్ వంటి సమస్యను నివారించవచ్చట. ఇక అంతే కాకుండా పసుపు ,ఎండుమిరియాల పౌడర్లను పాలలో కలిపి తీసుకోవచ్చు. నల్ల మిరియాలు కొవ్వును నియంత్రించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి. దీనివల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది.
నల్ల మిరియాల లో మెటబాలిజం బూస్టర్ గా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఫైటో న్యూట్రియంట్లు మన శరీరంలో ఉండే కొవ్వును సైతం కరిగిస్తాయి. ఈ నల్ల మిరియాల కు జోడిగా చిటికెడు కారం పొడిని చేర్చితే ఎన్నో అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: