మునగాకు ఆరోగ్యానికి ఎంత మంచిదంటే?

Purushottham Vinay
మునగకాయతోపాటు మునగాకు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. దీని వలన మన శరీరానికి ఎంతగానో మేలు జరుగుతుంది. మునగాకులో చాలా ముఖ్యమైన విటమిన్లు ఇంకా అలాగే ఖనిజాలు ఉన్నాయి.ఇక ఈ ఆకులో నారింజ కంటే ఏడు రెట్లు ఎక్కువ విటమిన్ సి, అరటిపండ్ల లో కంటే 15 రెట్లు ఎక్కువ పొటాషియం, అలాగే మునగాకులో క్యాల్షియం, ప్రోటీన్స్, ఐరన్ ఇంకా అమైనో యాసిడ్స్ కూడా ఉన్నాయి. ఇవి మన శరీరాన్ని నయం చేయడానికి ఇంకా కండరాలను నిర్మించడంలో సహాయపడతాయి. ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇంకా అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. మునగాకు ద్రవం వాపు, ఎరుపు ఇంకా నొప్పిని తగ్గిస్తుంది. మునగ చెట్టు ఆకులు, పువ్వులు ఇంకా విత్తనాలను ఔషధాలలో కూడా ఉపయోగిస్తారు. మునగాకు తినడం వలన మన ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇక అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మునగాకు విటమిన్ ఎ ను కలిగి ఉంటుంది.ఇది కంటి చూపును మెరుగుపరచడంలో బాగా సహాయపడుతుంది.


ముఖ్యంగా మునగాకు పాంక్రియస్ ను చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. పాంక్రియాస్ ను ఉత్పత్తి చేయడానికి బీటా కణాలు కూడా ఉంటాయి. బయటి ఆహార పదార్థాలను తినడం వలన ఫ్రీ రాడికల్స్ అనేవి ఎక్కువ మొత్తంలో శరీరంలో చేరుకుంటాయి. ఈ ఫ్రీ రాడికల్స్ బీటాకణాలను నాశనం చేసి పాంక్రియస్ ను దెబ్బతీస్తాయి.ఇంకా బీటా కణాలు నాశనం అవడం వలన ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వదు. దీని వలన పాంక్రియస్ బాగా దెబ్బతింటుంది. అయితే ఈ మునగాకు బీటా కణాలు నాశనం కాకుండా రక్షించి వాటి లైఫ్ టైం ను పెంచి ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగేలా కూడా చేస్తాయి. మునగాకులో క్లోరోజేనిక్ యాసిడ్ ఇంకా ఐసోథియో సైనైట్స్ ఉండడం వలన ఈ రెండు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను తగ్గించి గ్లూకోజ్ ను తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో కణాల్లోని కి వెళ్లేలా కూడా చేస్తాయి. ఇంకా ఆహారం ద్వారా వచ్చే గ్లూకోజ్ రక్తం లోకి చేరుతుంది. /

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: