చాక్లెట్ తినడం వల్ల ఉపయోగాలు తెలిస్తే షాక్..!!

Divya
చాక్లెట్ అనేది చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడి తింటూ ఉంటారు. ఇవి నాలుకకు రుచిని అందించడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. ఇందులో ఉండే కోకో ఫినాలీక్ సమ్మేళనాలు మన మెదడును చాలా చురుగ్గా ఉండేలా చేస్తాయి. వీటిని తినడం వల్ల మనకు ఉన్న ఎన్నో సమస్యలు కూడా తగ్గిపోతాయని పలువురు వైద్యులు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోని ప్రతి ఒక్కరు కూడా చాక్లెట్ల పైన మక్కువ చూపడంతో జులై 7వ తేదీన వరల్డ్ చాక్లెట్ డే గా ప్రకటించడం జరిగింది. కొన్ని దేశాలలో ఇటువంటి వాటిని చాలా గ్రాండ్గా జరుపుకుంటూ ఉంటారు.

అయితే 16వ శతాబ్దంలోని మొదటిసారిగా చాక్లెట్లను యూరప్ తీసుకువచ్చినట్లుగా అక్కడ కథనాలు వినిపిస్తూ ఉంటాయి. అందుచేతనే అక్కడి ప్రజలు అక్టోబర్ 28వ తేదీన చాక్లెట్  డే గా జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ చాక్లెట్ ను కనుగొనడానికి యూరోపియన్లకు చాలా సమయం పట్టినట్లుగా అక్కడి పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. 1550 జూలై 7వ తేదీ మొదటిసారి ఖండానికి చాక్లెట్ తెచ్చిన రోజుగా పరిగణిస్తారు అని అందరికీ తెలిసిందే. ఇకపోతే చాక్లెట్ లో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం ఒకసారి చదివి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఇకపోతే శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరచడానికి ఈ చాక్లెట్ చాలా బాగా పనిచేస్తుంది. చాక్లెట్ లో ఉండే ఫ్లేవనోల్స్ రక్తం గడ్డ కట్టడాన్ని నిరోధిస్తాయి అని చెప్పవచ్చు. ఇక ఒత్తిడిని తగ్గించడంలో కూడా చాక్లెట్ చాలా బాగా పనిచేస్తుంది. దీనిని తినడం వల్ల ఒత్తిడిని పెంచే హార్మోన్లు కూడా అదుపులోకి వస్తాయి. ఫలితంగా మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది. బరువు తగ్గడానికి కూడా చాక్లెట్ చాలా బాగా సహాయపడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు క్రమం తప్పకుండా చాక్లెట్ తింటే ఆరోగ్య ప్రయోజనాలతో పాటు బరువును కూడా తగ్గించుకోవచ్చు. గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడానికి,  ముఖంపై వచ్చే ముడతలను తొలగించడానికి కూడా ఈ చాక్లెట్ చాలా బాగా సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: