చింతపండు గురించి ఈ విషయాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Divya
పూర్వంలో టమోటాలకు బదులు ఎక్కువగా చింతపండుని ఉపయోగించే వాళ్ళు. కానీ కాలం మారుతున్న కొద్దీ టమోటా తినే వారు ఎక్కువయ్యి.. చింతపండును తగ్గిస్తున్నారు. కానీ వంటకాలలో మాత్రం తప్పకుండా చింతపండు వేయాల్సిందే.చింతపండు వేయని కూర అసలు రుచిగానే ఉండదు అని చెప్పడంలో సందేహం లేదు. రుచికి పుల్లగా, తీయగా ఉండే చింతపండును తినడానికి పిల్లలు కూడా ఇష్టపడతారు. అయితే చింతపండు కేవలం రుచిని మాత్రమే కాదు ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది. ముఖ్యంగా చింత ఆకు దగ్గర నుంచి గింజల వరకు ప్రతీదీ కూడా మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలుగజేస్తుంది.
ముఖ్యంగా చింతపండులో విటమిన్ సి తోపాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే శరీరంలో అనేక సమస్యలను దూరం చేయడానికి చింతపండు సహాయ పడుతుంది. ఇక చింతపండు గింజల్లో ఫైటో న్యూట్రియన్స్ ఉండడం వల్ల శరీరంలోకి ఎటువంటి వైరస్లు ప్రవేశించలేవు. అలాగే టార్టారిక్ యాసిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్ కూడా చింతపండులో లభిస్తుంది ఇది శరీరంలో ఫ్రీ రాడికల్స్ తో పోరాడి జబ్బుల బారిన పడకుండా శరీరాన్ని కాపాడుతుంది. ఇక శరీరంలోని అధిక కొలెస్ట్రాలను దూరం చేయడంలో చింతపండు చాలా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా రక్తంలో షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుతుంది.
అధిక రక్తపోటుతో పాటు కొన్నిరకాల అల్సర్లు అలాగే  కీళ్ల నొప్పులు,  బొబ్బలు, బేణుకులు కూడా తగ్గి పోతాయి. అయితే ఇలాంటి చర్మ సమస్యలు వచ్చినప్పుడు చింత చెట్టు యొక్క పువ్వులను,  ఆకులను ఎండబెట్టి.. ఉడకబెట్టి ఆ తర్వాత ఆ నీటిని చర్మానికి రాసుకుంటే ఇలాంటి సమస్యలు తగ్గిపోతాయి. ముఖ్యంగా చింత పండు గింజల వల్ల మలబద్ధకం, జీర్ణ సమస్యలు కూడా దూరం చేసుకోవచ్చు. మంచి యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉండే చింతపండు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: