ఈ లడ్డు తింటే మతిమరుపు తగ్గి ఆరోగ్యంగా ఉంటారు!

Purushottham Vinay
చిన్న పిల్లల్లో మతిమరుపు వంటి సమస్యలు చాలా ఎక్కువగా వస్తున్నాయి.. ఇక వీటన్నింటికీ పరిష్కారం గోధుమ లడ్డు..ఇక గోధుమలతో మనం చపాతీ పూరీలు తయారు చేసుకుంటూ ఉంటాం.. అంతేకాకుండా గోధుమ రవ్వతో ఉప్మా కూడా చేసుకుంటే అది చాలా రుచిగా ఉంటుంది.. ఇందులో ఎన్ని రకాల పోషకాలు ఉంటాయో అసలు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. గోధుమలు మన శరీరాన్ని దృఢంగా ఇంకా అలాగే ఆరోగ్యంగా ఉంచుతుంది.. ఈ లడ్డూలు తయారు చేసుకొని తినడం వలన మన శరీరానికి కావలసిన పోషక ఆహారం కూడా లభిస్తుంది..! ఇక ఈ గోధుమ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..! గోధుమపిండి ఒక కప్పు, పంచదార అర కప్పు, నెయ్యి పావు కప్పు, బాదం రెండు చెంచాలు, జీడిపప్పు రెండు చెంచాలు, ఎండు ద్రాక్ష రెండు చెంచాలు ఇంకా అలాగే యలుకల పొడి కొద్దిగా తీసుకోవాలి.ఇక ముందుగా పంచదారను పొడి చేసి దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో నెయ్యిని వేసి జీడిపప్పు, బాదం ఇంకా అలాగే కిస్మిస్ వేయించి దాన్ని పక్కన ఉంచుకోవాలి.. ఇక ఇప్పుడు మిగిలిన నెయ్యి మొత్తం కూడా వేసి వేడి అయ్యాక అందులో గోధుమ పిండిని వేసి దాన్ని కాస్త దోరగా వేయించాలి.


ఇక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇందులో పంచదార పొడి ఇంకా అలాగే యాలుకల పొడి వేసి కలపాలి. అలాగే చివర్లో వేయించి పెట్టుకున్న డ్రైఫ్రూట్స్ కూడా అందులో వేసి కలపాలి. ఇక ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని కొద్దికొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా వాటిని చుట్టుకోవాలి.. అంతే గోధుమ లడ్డు రెడీ అయిపోయినట్లే.ఇక ఈ గోధుమ లడ్డూలను రోజుకి ఒకటి చొప్పున పిల్లలు పెద్దలు తినవచ్చు. వీటిని తినడం వల్ల శరీరానికి కావలసిన ప్రొటీన్లు, మినరల్స్ ఇంకా అలాగే విటమిన్ సి కూడా చాలా సమృద్ధిగా లభిస్తాయి. అలాగే రోగ నిరోధకశక్తిని కూడా బాగా పెంపొందిస్తాయి. ఇంకా నాడీ వ్యవస్థను కూడా బాగా మెరుగుపరుస్తాయి. అలాగే మానసిక ప్రశాంతత కూడా అందిస్తుంది.ఇంకా జ్ఞాపకశక్తిని కూడా పెంపొందిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: