ఈ "టీ" ని 15 రోజులు తాగితే... బరువు తగ్గడం పక్కా?

VAMSI
అధిక బరువు అనేది ప్రతి ఒక్కరికీ సమస్యే, చిన్న వారికైనా, పెద్ద వారికైనా అధిక బరువు అనేది చాలా ఇబ్బందికరం. ఆరోగ్య పరంగా కూడా అధిక బరువు అనేది సమస్యాత్మకమే అన్నది తెలిసిందే. అంతేకాకుండా బరువు ఎక్కువగా ఉండి లావుగా ఉంటే అందంగా కూడా కనిపించము. ఈ రోజుల్లో అధిక బరువు అనేది ఇలా అందరినీ బాధిస్తోంది. అధిక బరువు కారణంగా ఆరోగ్యపరంగా ఇలా పలు రకాల సమస్యలు వేధిస్తున్నాయి. ఆ సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటూ జబ్బులకు దూరంగా ఉండాలి అంటే... ఖచ్చితంగా శరీర బరువును తగ్గించుకుని నార్మల్ వెయిట్ కి రావాలి. అలా చేయడానికి చాలా చిట్కాలు, వైద్యుల సలహాలు ఉన్నాయి.
అయితే రోజ్ టీ కూడా శరీర బరువును వేగంగా తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ టీ ను ఎలా తయారు చేసుకోవాలి, రోజుకు ఎన్ని సార్లు తాగాలి అన్న వివరాలను ఇపుడు చూద్దాం. ఆ టీ ను తయారుచేసే విధానం తెలుసుకుందాం.
స్టవ్ వెలిగించి టీ గిన్నె పెట్టి గ్లాసున్నర వరకు నీటిని అందులో పోయాలి. కాస్త మరగనిచ్చి ఆ నీటిలో కొన్ని ఎర్ర గులాబీ రేకలను వేసి కలపాలి. తాజా గులాబీ పువ్వు అయితే గుప్పెడు రేకలను వేయొచ్చు. అదే ఎండిన పువ్వు అయితే రెండు పువ్వుల వరకు తీసుకుని మొత్తం రేకులను వేయాలి. ఇపుడు మరికాస్త మరగనిచ్చి ఆ తర్వాత రెండు యాలకులను బాగా చితక్కొట్టి ఆ మిశ్రమంలో వేసి మరో పది నిమిషాల పాటు మరిగించాలి. ఆ తరవాత టీ ను వడకట్టి తాగితే సరి. ఇలా రోజుకు ఒకసారి చేస్తే చాలు. ఒకవేళ ఈ టీ కనుక మీకు పడనట్లైతే వెంటనే ఆపేయండి, వైద్యుల సలహా తీసుకుని మళ్ళీ మొదలుపెట్టండి.
ఇక ఈ రోజ్ టీ రంగు విషయానికి ఎండిన పువ్వులను కనుక టీ కొరకు వినియోగిస్తే ఈ టీ ఎరుపు రంగులో ఉంటుంది. అలా కాకుండా తాజా పువ్వులను తీసుకుంటే టీ గ్రే కలర్ లో వస్తుంది. ఈ టీని వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగడం ఉత్తమం. ఇలా ప్రతి రోజు కనుక క్రమం తప్పకుండా తాగితే 15 రోజుల్లోనే శరీరంలో కొవ్వు కరగటం ప్రారంభం అయ్యి బరువు తగ్గడం మీరే గమనిస్తారు. ఈ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండుట చేత ఇవి శరీరం లోని కొవ్వుని కరిగించి బరువు తగ్గించడానికి సహాయపడతాయి. రోజ్ టీ జీర్ణవ్యవస్థలో మంచి బ్యాక్టీరియా పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే యూరిన్ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. ఈ టీ వలన ఆకలి ఎక్కువుగా వేయదు. తక్కువ తిన్నా కడుపు నిండిన భావం కలుగుతుంది.  అలాగే మలబద్దకం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ రోజ్ టీ మనలోని రోగ నిరోధక శక్తి ని కూడా పెంచడం లో సహాయం చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: