రేపటి నుండి 14 రోజులు వృద్దులు చిన్న పిల్లలు ఎండలతో జాగ్రత్త ?

VAMSI
రానున్న రెండు రోజుల్లో సూర్య భగవానుడి మండే కిరణాల వేడి మరింత పెరగనుంది అని వాతావరణ శాఖ నుండి అందుతున్న సమాచారం. అసలే వేసవి కాలం ఉష్ణోగ్రతలు గరిష్టంగా 40 డిగ్రీలకు మించి భగభగ మండుతున్నాయి. భారత్ లోని కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుగా మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం అగ్ని జ్వాలల్లా మరింత వేడిని వెదజల్లుతున్నాయి. ముఖ్యంగా రానున్న రెండ్రోజుల్లో ఏపిలో ఎండలు రెండు నుండి మూడు డిగ్రీలు పెరగనున్నాయి అని సమాచారం. అయితే ఇందుకు కారణం అసని తుఫాన్ అని చెబుతున్నారు. ఇటీవలే ఏపి రాష్ట్రాన్ని వణికించిన అసని తుఫాన్ కొన్ని ప్రాంతాలలో ఇబ్బందికరంగా మారగా...మరికొన్ని ప్రదేశాల్లో మాత్రం ఉష్ణోగ్రత లను తగ్గించి చల్లదనం పెంచింది.
అయితే ఇపుడు అదే తుఫాను కారణంగా మళ్ళీ ఎండలు మండనున్నాయట. ఈ తుఫాను ప్రభావం తోనే భానుడు ఇపుడు భగభగమంటున్నాడు. వాతావరణంలో ఉన్న నీటి ఆవిరి మొత్తం ఈ అసని తుఫాన్‌ ఊడ్చి తీసుకుపోవడంతో ..ఇపుడు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సూర్యుడు నడి నెత్తిన మండే ఎండలతో ముట్టి కాయలు వేస్తున్నాడు. దాంతో ఈ అసని తుఫాను ప్రభావం వలన అంతకంతకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజల్ని విలవిల్లాడేలా చేస్తున్నాయి.
భానుడి భగభగలకు తోడుగా.. వేడి గాలులు కూడా పెరగడంతో ప్రజలు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లుగా విశాఖ నగరం వంటి ప్రాంతాల్లో వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండు మూడు రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది చాలదు అన్నట్లుగా రోహిణి కార్తెలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇంకా ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. మే 25 నుంచి రోహిణి కార్తెలు మొదలై.. జూన్‌ 8 వరకూ కొనసాగనున్న నేపథ్యంలో చిన్నారులు, వృద్దులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: