ఆరోగ్యం : బాదం తొక్కలతో ఎన్ని లాభాలో తెలుసా?

Purushottham Vinay
చాలా మంది కూడా నానబెట్టిన బాదం తినే ముందు దాని తొక్కను తీసేస్తారు… బాదం తొక్కలను తొలగించి తినడానికి వారు ఎక్కువగా ఇష్టపడతారు. కానీ మీకు తెలుసా.. బాదం తొక్కలో అనేక పోషకాలు ఉంటాయి. ఇందులో విటమిన్ ఇ చాలా పుష్కలంగా ఉంటుంది.. అలాగే చర్మానికి కూడా ఉయోగకరంగా ఉంటుంది.. అంతేకాకుండా బాదం తొక్కలతో అనేక లాభాలు కూడా ఉన్నాయి. అవెంటో ఇప్పుడు తెలుసుకుందామా.ఇక బాదం తొక్కలను మొక్కలకు ఎరువుగా ఉపయోగించాలి.. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ మైక్రోబయల్, యాంటీ వైరల్ ఇంకా ప్రీ బయోటిక్ లక్షణాలు మొక్కలలో మెటాబోలైట్స్ ఇంకా విటమిన్ ఇ మొత్తాన్ని పెంచడానికి పనిచేస్తాయి. అలాగే బాదం తొక్కల కంపోస్ట్ చేయడానికి ముందుగా వాటిని ఎండలో ఆరబెట్టి బాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇక ఆ మిశ్రమాన్ని మొక్కలకు వేయాలి.బాదం తొక్కలను మనం చట్నీ రూపంలో కూడా తీసుకోవచ్చు.. ఇందులో విటమిన్ ఇ, ఫైబర్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.


చట్నీ చేయడానికి బాదం తొక్కలను రాత్రంతా కూడా బాగా నానబెట్టాలి. ఇప్పుడు వేరు శనగలను బాగా వేయించి బాదం తొక్కలతో బాగా రుబ్బుకోవాలి.. బాణలిలో నూనె వేసి ఉల్లిపాయలు, శనగపప్పు, ఉల్లిపప్పు, ఎండుమిర్చి పొడి ఇంకా జీలకర్ర వేసి కలిపి వేయించాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమంలో రుబ్బిన బాదం తొక్క, శనగపప్పు, ఉప్పు ఇంకా చింతపండు రసం కలపాలి. ఆ చట్నీని ఆవాలు ఇంకా కరివేపాకులతో అలంకరించి సర్వ్ చేయాలి.బాదం పొట్టుతో తయారైన బాడీ వాస్ యాంటీ ఏజింగ్ లక్షణాలతో చర్మాన్ని తేమగా ఇంకా అలాగే మృదువుగా చేస్తుంది. ఇందుకోసం ఒక టేబుల్ స్పూన్ బాదం తొక్కలో 2 టీస్పూన్ల పాలు, ఒక టీస్పూన్ పసుపు ఇంకా కొద్దిగా రోజ్ వాటర్ అలాగే తేనె మిక్స్ చేసి 5 నిమిషాలు నానబెట్టాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాడి స్క్రబ్బర్ గా ఇంకా అలాగే ఫేస్ ప్యాక్ గా అప్లై చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: