కొబ్బరిపాల అన్నం : ఆరోగ్యానికి ఎంత మంచిదంటే?

Purushottham Vinay

కొబ్బరి పాలను ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి చాలా మంచి మేలు కలుగుతుంది. బరువు తగ్గడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, శరీరంలోని నొప్పులను ఇంకా వాపులను తగ్గించడంలో కొబ్బరి పాలు ఎంతో సహాయపడతాయి. కొబ్బరి పాలతో కూడా వివిధ రకాల ఆహార పదార్థాలను మనం తయారు చేస్తూ ఉంటాం. కొబ్బరి పాలతో చేసే మంచి వంటకాలలో కొబ్బరి పాల అన్నం కూడా ఒకటి. కొబ్బరి పాల అన్నం చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇక దీనిని చాలా సులువుగా కూడా తయారు చేసుకోవచ్చు.ఈ కొబ్బరి పాలతో అన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కొబ్బరి పాల అన్నం తయారు చేయడానికి కావల్సిన పదార్థాలు..

1.నానబెట్టిన బియ్యం – అర కిలో
2.కొబ్బరి కాయలు – 2,
3.తరిగిన పచ్చి మిర్చి – 3,
4.దాల్చిన చెక్క – 2,
5.లవంగాలు – 10,
6.యాలకులు – 6,
7.అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్,
8.జీడి పప్పు – 10,
9.ఉప్పు – రుచికి తగినంత,
10.నూనె – 3 టీ స్పూన్స్.

కొబ్బరి పాల అన్నం తయారు చేసే విధానం..

ముందుగా కొబ్బరి కాయల నుండి కొబ్బరిని తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి జార్ లో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు జార్ మూత తీసి తగినన్ని నీళ్లను అందులో పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక వస్త్రాన్ని తీసుకుని అందులో మిక్సీ పట్టిన కొబ్బరి మిశ్రమాన్ని ఉంచి చేత్తో బాగా పిండుతూ కొబ్బరి పాలను తీసుకోవాలి. ఇక బియ్యం ఉడకడానికి సరిపడా కొబ్బరి పాలు రానప్పుడు అందులో తగినన్ని నీళ్లను పోసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నూనె వేసి కాగిన తరువాత దాల్చిన చెక్క, యాలకులు ఇంకా లవంగాలు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత జీడిపప్పును కూడా అందులో వేసి వేయించాలి.తరువాత పచ్చి మిర్చిని ఇంకా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడా వేసి బాగా కలిపి పచ్చి వాసన పోయే దాకా వేయించుకోవాలి.

ఇవి వేగిన తరువాత ముందుగా తయారు చేసుకున్న కొబ్బరి పాలను ఇంకా ఉప్పు వేసి కలిపి కొబ్బరి పాలను మరిగించుకోవాలి. కొబ్బరి పాలు మరిగిన తరువాత నానబెట్టిన బియ్యాన్ని వేసి బాగా కలిపి మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి.ఇక అన్నం పూర్తిగా ఉడికిన తరువాత మూత తీసి అన్నాన్ని అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా రుచిగా ఉండే కొబ్బరి పాల అన్నం తయారవుతుంది. దీనిని నేరుగా లేదా ఏదైనా మసాలా కూరలతో కలిపి తింటే చాలా బాగా రుచిగా ఉంటుంది. ఇక ఈ కొబ్బరి పాల అన్నాన్ని తయారు చేసుకుని తినడం వల్ల కొబ్బరి పాల వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చు. కొబ్బరి పాలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య కూడా ఈజీగా తగ్గుతుంది. జుట్టు ఇంకా చర్మం ఆరోగ్యంగా ఉంటాయి.అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: