50 కేజీలు బరువు తగ్గి సంచలనం సృష్టించిన మహిళ?

VAMSI
అధిక బరువు కారణంగా చాలామంది బాధపడుతుంటారు. బరువు తగ్గాలనే కోరికతో ఎక్సైజ్ అని, యోగా అని, డైటింగ్ అని, వాకింగ్ అని ఇలా చాలానే చేస్తుంటారు. అయితే ఏమి చేసినా కొందరి బరువులో మాత్రం పెద్దగా మార్పు రాదు. మహా అయితే ఓ అయిదారు కేజీలు తగ్గడమే చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఒక మహిళ మాత్రం అందరూ ఆశ్చర్యపోయేలా ఏకంగా 50 కేజీల బరువు తగ్గి చూపించింది. ఆలిస్‌ ఏకంగా 50 కేజీలు తగ్గింది. పెళ్లి గౌనును వేసుకున్నప్పుడు తన భారీ శరీరాన్ని గౌనులో చూసుకుని ఖచ్చితంగా బరువు తగ్గాలని ఆమె నిర్ణయించుకున్నారట. ఇక అప్పటి నుంచి…కీటోను అనుసరించినట్లు చెప్పుకొచ్చారు ఆ మహిళ.
ఆలిస్‌కు 2020 సంవత్సరంలో ఆమె తన పెళ్లి గౌనును వేసుకున్నప్పుడు వచ్చిందట. ఇక అప్పటి నుంచి…కీటోను అనుసరించినట్లు చెప్పుకొచ్చింది. తొలినాళ్లలో ఇది చాలా కష్టంగా ఉండేది అని తర్వాత మెళ్లగా అలవాటు అయిపోయింది అని చెప్పుకొచ్చారు. మొదట్లో శరీరం చాలా నీరసంగా మారిందని ఆ తర్వాత అలవాటు అయ్యాక ఎలాంటి సమస్య రాలేదని ఆమె తెలిపారు. ఈ ప్రయాణంలో ఆమె ఇంటి పనులన్నీ స్వయంగా చేసుకుంటూ తనకు ఇష్టమైన ఆహార పదార్థాలను తింటూనే బరువు తగ్గుతూ వచ్చారట. ఇది నిజంగా ఆశ్చర్యకరమైన అంశమే. ఎందుకంటే బరువు తగ్గాలి అంటే ఖచ్చితంగా ఇష్టమైన ఫుడ్స్ ను చాలా వరకు దూరం పెట్టాలి. కానీ ఈమె అలా చేయలేదట.
ప్రస్తుతం, ఆలిస్ ఈ బరువు తగ్గాలి అనే ప్రయాణం మొదలుపెట్టి రెండేళ్లు అవుతోంది. ఈమె చాలా సంతోషంగా బరువు తగ్గుతున్నారు.  మీరు కూడా ఇలా అధిక బరువు తగ్గాలి అనుకుంటున్నారా...?? అయితే  మీరు కూడా మనసులో బలంగా సంకల్పించుకోండి, బరువు తగ్గాలని అనుకోవడం కాదు దృఢ నిర్ణయంతో కొనసాగించాలి. ఒకసారి డైట్ మొదలుపెడితే బరువు తగ్గడం పెద్ద సమస్యేమి కాదు అయితే ప్రయత్నం కొనసాగించాలి . అయితే మీరు కూడా ఈమెలా కీటో డైట్ ను ఫాలో అవ్వాలి అనుకుంటే మాత్రం.. తప్పకుండా వైద్యులను సంప్రదించి వారి సలహా తీసుకుని.. ఎందుకంటే అందరి శరీరం ఒకేలా స్పందించదు వారి వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యులు అందుకు తగ్గ సజెస్ట్ చేస్తారు. కాబట్టి ముందుగా డాక్టర్ ను సంప్రదించి ఆ తరువాత ఈ డైట్ ఫాలో అవ్వండి. బరువు తగ్గాలి అని ఏదైనా డైట్ ఫాలో అయ్యే ముందు హెల్త్ హిస్టరీ చాలా కీలకం అన్న విషయం గమనించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: