వేసవిలో శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉండాలంటే..?

Divya
వేసవి కాలం మొదలైంది.. అందుకు తగ్గట్టుగానే మనం కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది లేకపోతే శరీరం డీహైడ్రేషన్ కు గురి అయి ఎన్నో రకాల సమస్యలను కొని తెచ్చుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వేసవి కాలంలో శరీరం డీహైడ్రేషన్ కు గురి అయితే వడదెబ్బ తో పాటు మరెన్నో ఇతర చర్మ సంబంధిత సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. అంతే కాదు శరీరం డీహైడ్రేషన్ కు గురైనప్పుడు చర్మం పొడిబారిపోవడం వంటి సమస్యల వల్ల చిరాకు , దురద, దద్దుర్లు వంటివి వచ్చే అవకాశం కూడా ఎక్కువ. వేసవి కాలంలో శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉండాలి అంటే కొన్ని రకాల పానీయాలు సేవించాలి.

ఆపిల్:
పోషకాల నిధి గా పిలువబడే ఆపిల్ లో 80 శాతం నీరు ఉంటుంది.  అంతే కాదు అధికంగా మినరల్స్ , విటమిన్స్ ఉన్న ఆపిల్ రసం తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. జీవక్రియ రేటును మెరుగు పరచడంతో పాటు గుండె సంబంధిత సమస్యలను కూడా ఈ జ్యూస్ దూరం చేస్తుందని చెప్పవచ్చు.
దోసకాయ:
ఈ కాలంలో విరివిగా లభించే దోసకాయలో కూడా 90 శాతం నీరు ఉంటుంది. ఇందులో అధికంగా లభించే పొటాషియం వల్ల వడదెబ్బ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. దోసకాయలో  వుండే ఫిసెటిన్ అనే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఎలిమెంట్ కారణనంగా మెదడు మెరుగైన పనితీరుకు తోడ్పడుతుంది.
పుచ్చకాయ:
పుచ్చకాయ రసం తాగడం వల్ల రుచిగా ఉండడమే కాకుండా 90 శాతం నీరు అధికంగా లభిస్తుంది. పుచ్చకాయ రసం తాగడం వల్ల శరీరం డీహైడ్రేట్ కాకుండా రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. పుచ్చకాయ రసం గుండె జబ్బులను దూరం చేయడంలో సహాయపడుతుంది.
పుట్టగొడుగులు:
పుట్టగొడుగులలో మనకు విటమిన్ డి తో పాటు విటమిన్ బీ 2 అధికంగా లభిస్తుంది. నీటి శాతం అధికంగా లభించే పుట్టగొడుగులు తినడం వల్ల అలసటను తగ్గించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: