బంగాళదుంప ఎక్కువ తింటున్నారా? అయితే ప్రమాదమే!

Purushottham Vinay
బంగాళాదుంప కూర ఎంత రుచికరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇదంటే ప్రతి ఒక్కరికీ కూడా చాలా ఇష్టం. ఈ బంగాళాదుంప ని ఎక్కువగా ప్రతి కూరగాయలతో కలిపి వండుతుంటుంటారు. ఎందుకంటే బంగాళాదుంప తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది.ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. విటమిన్ ఎ, పొటాషియం, విటమిన్ సి, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్ ఇంకా అలాగే ఐరన్ వంటి అనేక ప్రయోజనకరమైన పోషకాలు ఈ బంగాళదుంపలో పుష్కలంగా ఉన్నాయి. దీనితో పాటు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, గ్లూకోజ్ ఇంకా అలాగే అమైనో ఆమ్లాలు కూడా కనిపిస్తాయి. అలాగే బంగాళదుంపలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని, ఇది అనేక సమస్యలను దూరం చేస్తుందని ఆయుర్వేదం కూడా చెబుతోంది. కానీ, బంగాళదుంపలు తినడం వలన కొన్ని సమస్యలలో చాలా హానికరం అని చెబుతుంటారు. బంగాళాదుంపలను ఏ సమస్యలలో తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ఎసిడిటీ – బంగాళదుంపల వినియోగం ఆమ్లత్వంలో ప్రమాదంగా పరిగణిస్తున్నారు. మీరు బంగాళాదుంపలను కనుక క్రమం తప్పకుండా తీసుకుంటే, ఇక దీని కారణంగా ఎసిడిటీ సమస్య మరింత పెరుగుతుంది. ఇది కాకుండా, బంగాళాదుంపలను ఎక్కువగా తినడం వల్ల గ్యాస్ ఏర్పడే సమస్య కూడా వస్తుంది. కొంతమంది బంగాళాదుంపలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఉబ్బరం సమస్యను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. దీని వలన వైద్యులు ఇలాంటి వారిని బంగాళాదుంపలను అసలు తినొద్దని చెబుతుంటారు.


షుగర్- షుగర్ పేషెంట్లు అసలు బంగాళదుంపలను తినకూడదు. టైప్ 2 డయాబెటిస్ లేదా హై బ్లడ్ షుగర్ ఉన్నవారు ఈ బంగాళాదుంపలను తినకూడదు. బంగాళాదుంపలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. దాని వినియోగం రక్తంలో చక్కెరను అంటే శరీరంలో గ్లూకోజ్ మొత్తాన్ని బాగా పెంచుతుంది. దీని వల్ల చక్కెర సమస్య పెరిగే ప్రమాదం చాలానే ఉంది.


రక్తపోటు- రక్తపోటు ఉన్న రోగులు కూడా ఈ బంగాళాదుంపలను తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. ఎక్కువ బంగాళదుంపలు తినడం వల్ల రక్తపోటు ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి, అలాంటి వారు బంగాళదుంపలను తక్కువగా మాత్రమే తినాలి.


ఊబకాయం-అలాగే ఊబకాయం సమస్యతో బాధపడుతుంటే మాత్రం.. బంగాళదుంపలు అస్సలు తినకూడదు. ఇవి చాలా హానికరంగా మారతాయి. బంగాళదుంపల్లో పిండి పదార్ధాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దీని కారణంగా బరువు చాలా వేగంగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇక బరువు తగ్గాలనుకుంటే మాత్రం తక్కువ పరిమాణంలో బంగాళదుంపలు తినడం ఆరోగ్యానికి చాలా మంచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: