జీర్ణక్రియ సరిగ్గా పనిచేయాలంటే ఇలా చెయ్యండి..!!

Purushottham Vinay
జీర్ణక్రియ..ఇక మనం తినే ఆహారాలను బట్టి జీర్ణం అయ్యే సమయం అనేది మారుతుంది. శాకాహారం కనుక తింటే త్వరగా జీర్ణం అవుతుంది.అదే మాంసాహారం కనుక అయితే జీర్ణమయ్యేందుకు కొంత ఎక్కవ సమయం పడుతుంది.కొంత మందిలో జీర్ణశక్తి సరిగా ఉండకపోవటం వల్ల కొద్ది మొత్తంలో తీసుకున్నా కాని సరిగ్గా అరగక అనేక రకాల ఇబ్బందులు పడుతుంటారు.ఇక అలాంటి వారు జీర్ణశక్తిని పెంచుకునే వివిధ రకాల చిట్కాలను ట్రై చేయటం వల్ల వారు కొంత ఫలితం అనేది పొందవచ్చు. భోజనం చేసిన తరువాత పండ్లను ఎక్కువగా తినటం వల్ల జీర్ణక్రియ బాగా మెరుగయ్యే అవకాశం ఉంటుంది. ఇక అంతేకాకుండా ఆహారం కూడా త్వరగా జీర్ణమవుతుంది. అలాగే భోజనం చేసిన గంట తరువాత యాపిల్ పండ్లను కనుక తింటే అంతకుముందు తిన్న ఆహారం అనేది త్వరగా జీర్ణమవుతుంది.ఇక  అలాగే నారింజ, జామ ఇంకా అలాగే దానిమ్మ పండ్లు సైతం జీర్ణక్రియను మెరుగు పర్చటంలో సహాయకారిగా పనిచేస్తాయి.


ఇక భోజనానికి ముందు కనుక పుదీనా రసం తీసుకుంటే జీర్ణ సమస్యలు దూరమై తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. తిన్న ఆహారం చాలా త్వరగా జీర్ణం కావడానికి ఉపయోగపడే బాక్టీరియా పెరుగులో ఎక్కువగా ఉంటుంది. అలాగే మనం తినే ఆహరం తో పాటుగా ఒక కప్పు పెరుగుని కనుక తింటే ఆహరం చాలా సులువుగా జీర్ణం అవడానికి ఉపయోగపడుతుంది. అలాగే మనం తినే ఆహారం లో జీలకర్ర ని వాడటం వల్ల వంట రుచి మారిపోవడంతోపాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇక తిన్న ఆహారం త్వరగా అరిగిపోవటానికి దోహదం కూడా చేస్తుంది. అజీర్ణం ఇంకా అజీర్తి మలబద్ధకం వంటి సమస్యలకు బొప్పాయి పండు కూడా బాగా తోడ్పడుతుంది. ఇక భోజనం చేసిన గంట తరువాత బొప్పాయి ముక్కలను కనుక తీసుకుంటే మీకు మంచి ఫలితం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: