నులిపురుగులను దూరంచేసే చక్కని చిట్కా..!!

Divya
సాధారణంగా చిన్న పిల్లల కడుపులో ఏర్పడే ఈ నులి పురుగుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ నులిపురుగులు పిల్లల కడుపులో చేరి పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఈ నులి పురుగులు పిల్లల కడుపులో చేరడం వల్ల తీవ్రమైన కడుపునొప్పి, సరిగా తినకపోవడం , వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు ఏర్పడతాయి. చిన్నారులను పట్టి పీడించే అనారోగ్య సమస్యలను ఈ నులిపురుగుల సమస్య అనేది మొదటి వరుసలో ఉంటుందని చెప్పవచ్చు. పిల్లల పొట్టలో చేరడం వల్ల పిల్లలు పీల్చి పిప్పి చేస్తాయి. ఈ నులి పురుగుల వల్ల చిన్నారి ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

పిల్లలలో నులి పురుగులు చేరడం వల్ల ఎదుగుదల ఆగిపోవడం.. ఆకలి మందగించడం.. పోషకాల కొరత.. తీవ్రమైన కడుపునొప్పి.. రక్తహీనత.. నీరసం.. బలహీనత.. రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం.. అతిసారం.. ఏకాగ్రత లోపించడం ఇలా రకరకాల సమస్యలు ఎదురవుతాయి. ఇకపోతే పిల్లల కడుపులో నులిపురుగులు సంక్రమించడానికి ప్రధాన కారణం అపరిశుభ్రత కాబట్టి ఇంటి పరిసరాలను ఇంటి ని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి . పిల్లలు తినే ఆహారం పై ఈగలు, దోమలు వాలకుండా చేసుకోవడంతోపాటు కంచాలు, గిన్నెలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.

ఇక పిల్లలకు ప్రతిరోజు కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగించాలి. సరిగ్గా ఉడకని ఆహార నిపుణులు పాటలు కూడా మీరు మీ పిల్లలకు పెట్టరాదు. పిల్లలు శుభ్రంగా ఉండేలా గా వారిని చూసుకోవడంతో పాటు చేతి గోళ్లలో దుమ్ము, ధూళి లేకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. మలవిసర్జన తర్వాత భోజనానికి ముందు పిల్లల చేతులు తప్పని సరిగా శుభ్రం చేయాలి. చెప్పులు లేకుండా పిల్లలు బయటకు పంపించకూడదు. దానిమ్మ పండ్లు , స్వచ్ఛమైన తేనె,  ఆహారాలు పిల్లలకు ఇవ్వవచ్చు. వెల్లుల్లి, పుదీనా ,క్యారెట్ , కీరదోస వంటి ఆహారాలు కూడా పిల్లలకు ఇవ్వాలి. కాబట్టీ తప్పకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి తల్లిదండ్రులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: