బరువును తగ్గించే చిట్కాలు ఏంటో తెలుసా..?

Divya
ఇటీవల కాలంలో చాలా మందికి ఉండే సమస్యల్లో అధిక బరువు కూడా ఒకటి.. ముఖ్యంగా శరీరంలో కొవ్వు అధికంగా పేరుకుపోయి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఐదు రకాల శరీర భాగాల్లో కొవ్వు అధికంగా పేరుకుపోయి కనిపించడానికి ఇబ్బందికరంగా అనిపించినా అనారోగ్య సమస్యలు అయితే ఉండవు అని చెప్పవచ్చు.. తొడల భాగం, మెడ వెనుక భాగం , చెస్ట్ భాగం లో కొవ్వు అధికంగా ఉండడం వల్ల ఎలాంటి సమస్య అయితే రాదు.. కానీ పొట్ట చుట్టూ ఉండే కొవ్వు వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతాయి.
ఇకపోతే గ్రీన్ టీ ని మనం రోజువారి డైట్ లో చేర్చుకోవడం వల్ల పొట్ట చుట్టూ ఉండే కొవ్వును త్వరగా తగ్గించుకోవచ్చు.. ముఖ్యంగా గ్రీన్ టీలో కెఫిన్ అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల ఇవి రెండూ కూడా మెటబాలిజంను పెంపొందిస్తాయి. కాబట్టి గ్రీన్ టీని తాగడం అలవాటు చేసుకోండి.
అవకాడో కూడా ఆరోగ్యానికి చాలా మంచి పోషకాలను అందిస్తుంది. ఇక ఇందులో సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. కాబట్టి ఆకలిని తగ్గిస్తుంది. ఇక అవకాడో ను జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవచ్చు. మనం ఆరోగ్యంగా ఉండడానికి అవకాడో జ్యూస్ ఎంతగానో సహాయపడుతుంది.. బరువును తగ్గించుకోవడానికి అవకాడో జ్యూస్ చాలా బాగా పనిచేస్తుంది.
పసుపు ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు కలిగిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఆరోగ్య ప్రయోజనాలతో పాటు సౌందర్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అందుకే ఆయుర్వేద చికిత్సలో పసుపును ఎక్కువగా ఉపయోగిస్తారు. లివర్ లో ఉండే చెడు పదార్థాలను బయటకు పంపించడానికి పసుపు చాలా బాగా ఉపయోగపడుతుంది.. ముఖ్యంగా లివర్ లో ఉండే ఫ్యాట్ ను కంట్రోల్ చేస్తుంది. పాలు లేదా ఇతర జ్యూస్లలో పసుపు కలుపుకుని తాగడం వల్ల చాలా ప్రయోజనాలు మనకు కలుగుతాయి. అంతేకాదు బరువు తగ్గే అవకాశాలు కూడా ఎక్కువ అనే చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: