ఓట్స్ ఇడ్లీ తో ఈ సమస్యలకు చెక్..!!

Divya
సాధారణంగా ఇడ్లీ తినడం వల్ల తేలికగా జీర్ణమయ్యే అన్ని సమస్యలను దూరం చేసుకోవచ్చు అని చాలామందికి తెలుసు.. అందుకే ఇటీవల కాలంలో సుమారుగా కొన్ని వేల మంది ఉదయం అల్పాహారంలో అలాగే రాత్రి సమయంలో కూడా ఇడ్లీ తమ లైఫ్ స్టైల్ లో ఒక భాగం చేసుకుంటున్నారు. ఇడ్లీలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి.. బరువు పెరిగే అవకాశం ఉండదు. తేలికగా జీర్ణం అవుతుంది.. కాబట్టి జీర్ణక్రియ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉండదు.. అందుకే ఇడ్లీ తినడం వల్ల ఎటువంటి సమస్యలు ఉండవని ప్రతి ఒక్కరు తినడానికి ముందుకు వస్తారు. అయితే ఇప్పుడు చెప్పబోయే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఆ ఓట్స్ ఇడ్లీ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి..? అనే విషయం తెలుసుకుందాం.

ఓట్స్ ఇడ్లీ తినడం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక అని చెప్పవచ్చు. అంతే కాదు ఇందులో బీటా గ్లూకెన్ అనే పీచు పదార్థం ఉండడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాదు మధుమేహం కూడా అదుపులో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.. అయితే ఎవరైతే డయాబెటిస్ తో బాధపడుతున్నారో అలాంటి వారు తమ ఆహారంలో ఓట్స్ ను చేర్చుకోవడం వల్ల సమస్యలు దూరమవుతాయి. ఇక అంతే కాదు గుండెపోటు వంటి సమస్యలు తగ్గే అవకాశాలు కూడా ఎక్కువే. ప్రతిరోజు ఓట్స్ తో తయారు చేసిన ఆహార పదార్థాలను తినడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడి.. ఒత్తిడి తగ్గుతుంది.
అయితే మనకు ఓట్స్ ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలి అనే విషయాలు కూడా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతున్నాయి.. యూట్యూబ్ వంట ఛానల్ లో అధికంగా చూపిస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఈ ఓట్స్ ఇడ్లీ తయారుచేసుకుని ఈ ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా డయాబెటిస్ వారు ఇడ్లీని తినమని వైద్యులు సైతం సిఫార్సు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: