బరువు పెరగాలనుకొనే వారికి చక్కటి శుభవార్త..!!

Divya
ఈ మధ్య కాలంలో చాలా మంది అధిక బరువుతో బాధపడుతూ ఉంటే మరి కొంతమంది చాలా బక్కగా.. ఎలాంటి డ్రెస్ వేసుకున్న సరే నలుగురిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. బరువు పెరగడం కోసం ఎన్నో రకాల ఫుడ్స్ తీసుకున్నా సరే వాళ్ళు బరువు పెరగకుండా నానా ఇబ్బంది పడి పోతున్నారు. చాలా సన్నగా బక్కగా ఉన్నవారు బరువు పెరగాలనుకుంటున్నారా..? అయితే అలాంటి వారికి ఒక చక్కటి శుభవార్త అని చెప్పవచ్చు. అదేంటో మనం ఇప్పుడు చదివి తెలుసుకుందాం.

బరువు పెరగాలంటే.. వారికి అంజీర పండ్లు చాలా చక్కగా పనిచేస్తాయి. అంజీర పండ్లను కిస్మిస్ లతో కలిపి తీసుకుంటే త్వరగా బరువు పెరుగుతారు. ఈ రెండింటిలో అద్భుతమైన పోషకాలతో పాటు కొవ్వులు కూడా ఉన్నాయి. ఇవి రెండు కూడా బరువుని పెంచడంలో సహాయ పడతాయి.. కాబట్టి ప్రతి రోజూ గుప్పెడు ఎండిపోయిన అంజూర పండ్లు , గుప్పెడు కిస్మిస్లను కలిపి నీటిలో నానబెట్టాలి.. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ లో తినడం వల్ల బరువు పెరగడంతో పాటు రోగనిరోధక శక్తిని కూడా పెంపొందించుకోవచ్చు.
ఇక ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పాలు తాగితే ఆ తర్వాత నాలుగైదు అంజీర పండ్లు తినాలి. ఇలా చేయడం వల్ల  ఎముకలు దృఢంగా మారడమే కాకుండా బరువు కూడా పెరుగుతారు. ఉదయాన్నే ఓట్స్ తో పాటు అంజూరాలను కూడా ఉడకబెట్టి పాలలో కలిపి తినాలి. ఒక కప్పు మిశ్రమాన్ని ప్రతిరోజూ ఉదయమే తినడం వల్ల బరువు పెరుగుతారు. అంతే కాదు ప్రతి రోజు నీటిలో కొన్ని అంజూరాలను రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే పాలలో కలుపుకుని తినడం వల్ల కూడా బరువు పెరుగుతారు.

ఇకపోతే వీటిని పాటించడం కుదరదు అనుకునేవాళ్ళు ప్రతిరోజు రాత్రి 5 ఖర్జూరాలు , ఐదు అంజూరాలు కలిపి తిని నిద్ర పోవచ్చు. శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నవారు ఖర్జూరాలను తినకపోవడమే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: