ఒమిక్రాన్ : రక్షించుకోవాలి అంటే ఈ పానీయం తాగాల్సిందే..!!

Divya
ఒమిక్రాన్ .. సాధారణంగా ఈ వైరస్ నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి అంటే ముందుగా మనలో రోగ నిరోధక శక్తి పెరగాల్సి ఉంటుంది. మనలో రోగ నిరోధక శక్తి పెరగాలంటే తప్పకుండా తినే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఇప్పుడు చెప్పబోయే ఒక చిన్న చిట్కాలు పాటించినట్లయితే జలుబు, దగ్గు , నీరసం, ముక్కు కారటం వంటి సమస్యలు అన్నీ దూరమవుతాయి. ఇకపోతే ప్రస్తుతం చలికాలం కాబట్టి ఇలాంటి సమస్యలు రావడం సహజమే కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే కచ్చితంగా కరోనా సోకింది అని నిర్ధారణకు వస్తున్నారు.
కాబట్టి మీకు కనుక ఇప్పుడు చెప్పిన సమస్యలన్నీ కొత్తగా మొదలు అవుతుంటే ఇప్పుడు చెప్పబోయే చిట్కా తప్పకుండా పాటించండి. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో ఒక పావు కప్పు జీడిపప్పు, పావు కప్పు పిస్తా, మరొక పావు కప్పు బాదం అన్నింటిని వేసి చక్కటి వాసన వచ్చేవరకు లో ఫ్లేమ్ మీద వేయించాలి. వీటిని పక్కన పెట్టి అదే పాన్లో రెండు టేబుల్ స్పూన్లు మిరియాలు, ఒక టేబుల్ స్పూన్ లవంగాల తో పాటు 10 యాలకులు వేసి బాగా వేయించాలి.
ఇకపోతే ప్రస్తుతం ఇలా బాగా వేయించిన వాటిని అన్నింటిని మిక్సీలో వేసి కొద్దిగా పసుపు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇలా మెత్తగా చేసుకున్న ఈ పౌడర్ సుమారుగా ఆరు నెలల పాటు నిల్వ ఉంటుంది. ఇక ప్రతిరోజు గ్లాసు పాలలో ఈ పొడిని వేసుకొని తాగడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఈ పొడి యొక్క పూర్తి ప్రయోజనాలు కనుక మీకు పొందాలి అంటే పాలు ఉడికేటప్పుడు అందులో టేబుల్ స్పూన్ ఈ పొడి వేయాలి.. మరుగుతూ  ఉన్నప్పుడే కొద్దిగా బెల్లం వేయాలి.
ఈ పాలను స్టవ్ మీద నుంచి తీసి ఒక నిమిషం ఆగి తాగడం వల్ల శరీరానికి రోగ నిరోధక శక్తి పెరగడం కాకుండా దగ్గు, జలుబు, జ్వరం, గొంతునొప్పి ,ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు అన్నీ దూరమవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: