కీళ్ల నొప్పులను తగ్గించే ఈ అద్భుతమైన పండు గురించి తెలుసుకోవాల్సిందే..!!

Divya
ఇటీవల కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా కీళ్ల నొప్పులు, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అంటూ రకరకాలుగా ఇబ్బంది పడుతున్న విషయం అందరికీ తెలిసిందే.. అయితే ఈ కీళ్లనొప్పులను తగ్గించుకోవడానికి చాలా మంది వైద్యులను సంప్రదిస్తూ చిన్నప్పటి నుంచే ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడటం మొదలుపెడతారు. ఫలితంగా భవిష్యత్తులో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇకపోతే ప్రకృతి మనకు ఎన్నో మొక్కలను వరంగా ప్రసాదించింది.. వాటిలో సీజనల్ గా దొరికే పండ్లను ఎప్పటికప్పుడు తింటూ ఉండడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు.

ఇక ఈ క్రమంలోనే ఈ సీజన్లో దొరికే సిట్రస్ జాతికి చెందినటువంటి పంపర పనస పండు లో ఎన్నో ఔషధాలు, పోషకాల తో పాటు  మరెన్నో ఆరోగ్యప్రయోజనాలు కూడా కలిగి ఉన్నాయి. ఇకపోతే ఈ కాయ తినడానికి పులుపు..వగరు.. తీపి రుచుల కలయికతో రెండు రంగులలో మనకు కనిపిస్తుంది. ఇక ఈ పండు ను మహిళలు ప్రతిరోజు తిన్నట్లయితే వయసు పెరిగే కొద్దీ ఎముకలకు సంబంధించి వచ్చే సమస్యలు దూరమవుతాయి..ఎముకలలో క్యాల్షియం పెరిగి దృఢంగా మారడమే కాకుండా అస్థియో ఫ్లోరోసిస్.. కీళ్ళనొప్పులు కూడా దూరమవుతాయి..
ఇక ఈ పండ్లను తినడం వల్ల కేవలం కాళ్ల నొప్పులు ,కీళ్ల నొప్పులు మాత్రమే కాదు డయాబెటిస్ ఉన్న వారికి కూడా ఒక మంచి ఔషధంగా పనిచేస్తుంది. కాలేయ సమస్యలు లేకుండా అధిక బరువు కాకుండా మనల్ని చాలా చక్కగా కాపాడుతుంది. శరీరంలో ఉండే ప్రతి అవయవానికి , కణాలకు.. రక్త ప్రసరణ బాగా జరిగేలా చేయడంతోపాటు రక్తపోటును కూడా నియంత్రణలో ఉంచుతుంది. ఒక జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో ఈ పండు ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఎప్పుడైనా ఒకవేళ కడుపుబ్బరం గా అనిపిస్తే.. ఈ పంపరపనస యొక్క తొనలను తింటే కేవలం 5 నిమిషాల్లోనే ఉబ్బరం పోతుంది. ఈ పంపరపనస పండు ను  చాలామంది సలాడ్.. జ్యూస్ రూపంలో తీసుకుంటూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: