మీరు పంటి నొప్పితో బాధపడుతున్నారా.. అయితే ఇవి పాటించాల్సిందే..!

MOHAN BABU
మానవ శరీరంలో ఏ అవయవం బాగా లేకపోయినా అది తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుంది. ఇక దంతాల విషయానికి వస్తే మనిషిని చూడగానే, మనకి ముందుగా తారసపడేవి దంతాలు. ఇవి దంతాలు మనకి ఎంతో అందాన్నిస్తాయి.  అయితే ఒకవేళ పంటినొప్పి వచ్చిందంటే అంత ఈజీగా తగ్గిపోదు.  మరి పంటి నొప్పి ఎందుకు వస్తుంది.. ఎలా వస్తుందో.. తెలుసుకుందాం..?


 మనం తీసుకునే ప్రతి ఆహారపదార్థం  దంతాలకు పని  చెప్తుంది. అయితే మనం ఏది పడితే అది తినడం వలన, లేదంటే గాయాలు తగలడం వలన మన పళ్ళు దెబ్బతింటాయి. దీంతో పంటికి చిన్న నొప్పి వచ్చినా అది ఎంతో బాధ కలిగిస్తుంది. మనం కనీసం ఏమీ తినలేని పరిస్థితి ఏర్పడుతుంది. వీటితో పాటు దంతాల ఇన్ఫెక్షన్, కొత్తగా దంతాలు రావడం అనేది, పండ్లలో పగుళ్ళు, చిగుళ్లకు సంబంధించిన వ్యాధుల వలన నొప్పి అధికమవుతుంది. కానీ అది ఒకసారి వచ్చిందంటే  అంత ఈజీగా తగ్గిపోదు. ఈ దంతాల నొప్పి తగ్గాలంటే తప్పనిసరిగా మనం డాక్టర్ ను సంప్రదించాల్సిందే. నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని చిట్కాలు పాటిస్తే కాస్త ఉపశమనం కలుగుతుంది. ఒక్కోసారి పళ్లలో ఎక్కువగా పెరిగిపోయినటువంటి వ్యర్థ పదార్థాల వలన ఇన్ఫెక్షన్ వచ్చి పంటి నొప్పులు రావచ్చు.

 అలాంటప్పుడు మనం గోరువెచ్చని నీళ్ళలో కాస్త ఉప్పు కలిపి నోట్లో పోసుకుని బాగా పుక్కిలించి ఉంచాలి. దీంతో పళ్ల మధ్య ఉన్నటువంటి  వ్యర్థాలు అన్ని  బయటకు పోయి, నొప్పి నుంచి కాస్త ఉపశమనం దొరుకుతుంది. అలాగే కట్ చేసినటువంటి ఉల్లిగడ్డ ముక్కలను నొప్పి ఉన్నటువంటి ప్రాంతంపై పెట్టడం వలన నొప్పి నుంచి ఉపశమనం దొరుకుతుంది. దీంతో పాటుగా అల్లం వెల్లుల్లి పేస్టు బాగా దంచి అందులో కొద్దిగా మిరియాల పొడి మరియు ఉప్పు వేసి నొప్పి ఉన్న దగ్గర పెడితే తగ్గుతుంది. అలాగే ఆవనూనెలో కొద్దిగా ఉప్పు కలిపి చిగుళ్లపై రాసుకుంటే  ఉపశమనం దొరుకుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: