అనారోగ్యాన్ని దూరం చేసే పర్ఫెక్ట్ డైట్ ఇదే?

VAMSI
ఆహారం ఎందుకు తింటాం కేవలం కడుపు నింపుకోవడానికి మాత్రమే కాదు, దానితో పాటు పోషకాలను శరీరానికి అందించి శరీర పెరుగుదలకు, అలాగే ఆరోగ్యంగా ఉండటానికి. అయితే ఇప్పటి రోజుల్లో ఎన్నో రకాల ఆహార పదార్థాలు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. ఆకర్షణీయంగా ఉన్నాయి లేదా అని చూస్తున్నారు కానీ అవి ఆరోగ్యానికి ఎంత వరకు ఉపయోగపడతాయి అన్నది చాలా మంది చూడటం లేదు. అసలు కొన్ని ఆహార పదార్దాలు అయితే రోజు మనం తినే ఆహారంలో ఉంటాయి కానీ అవి మన ఆరోగ్యానికి పెద్దగా ఉపయోగపడకపోగా కీడును చేస్తాయి. ఇప్పుడు మన ఆరోగ్యానికి పెద్దగా ఉపయోగ పడని ఆహారపదార్థాలు కొన్నిటిని చూద్దాం.
* ముఖ్యంగా మనము ఏ ఆహారం తీసుకున్నా చాలా రోజుల వరకు పురుగు పట్టకుండా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది కాదు. ఎక్కువ రోజులు పురుగు పట్టలేదు అంటే దాని అర్దం అది విషంతో సమానం. ఆహార పదార్థం ఏదైనా ఎక్కువ రోజులు నిలువ ఉంచితే పురుగు పడుతుంది. దాని అర్దం అది మంచి ఆహారం అని. అలాగని పురుగు పట్టిన ఆహారం తినమని చెప్పడం లేదు. ఇక్కడ గమనించాలి.
* అలాగే ఇడ్లీ రవ్వ చాలా మంది ఎక్కువగా బయట దొరికే ఇడ్లీ రవ్వను తీసుకొచ్చి వాడుతుంటారు. నిజానికి ఈ ఇడ్లీ రవ్వ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఇందులో పోషకాలు చాలా చాలా తక్కువగా ఉంటాయి. దానికి బదులుగా మీరే ఇంట్లో కొర్ర బియ్యంతో కానీ, రాగులతో కానీ, సజ్జలు, జొన్నలు లేదా మామూలు బియ్యంతో కానీ రవ్వలా మిక్సీకి వేసుకుని ఇడ్లీ పెట్టుకుని తింటే అది ఆరోగ్యం.
* మీరు ఇడ్లీ పెట్టుకునే సమయంలో ఆ పిండిలో కాస్త క్యారెట్, పాలకూర వంటివి సన్నగా తరిగి వేసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. చక్కగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అన్ని కలసి మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి.
* అన్నం తినే అరగంట ముందు రెండు గ్లాసుల నీరు తాగాలి. అన్నం తక్కువగా తీసుకుని కూర ఎక్కువగా వేసుకుని తినాలి. రాత్రి సమయంలో ఫ్రూట్స్ మాత్రమే బోజనంగా తీసుకోండి. ఇలా నెల రోజులు పాటు పాటించి చూడండి తేడా మీరే గమనిస్తారు. మీ శరీరం ఎంతో హుషారుగా ఉంటుంది. బరువు అదుపులో ఉంటుంది.  అనారోగ్య సమస్యలు తక్కువ అవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: