ఉల్లిద్వారా.. ఉలిక్కిపడ్డ అమెరికా..!

Chandrasekhar Reddy
ఒక ఉల్లిగడ్డ అమెరికా ప్రజలను హడలెత్తించింది. కారణం దానితోపాటు ఏదో బాక్టీరియా కూడా దిగుమతి తో వచ్చేసిందట. అందుకే దానిని వంటలలో వాడిన వాళ్ళు అందరు అనారోగ్యం పాలై, ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఒక్కసారిగా భారీగా ఈ చేరికలు పెరిగిపోవడంతో అమెరికా దర్యాప్తు ప్రారంభించి, మెక్సికో నుండి దిగుమతి చేసుకున్న ఉల్లిగడ్డతో పాటుగా వచ్చిన సాల్మొనెల్లా బాక్టీరియా తో వచ్చిన తిప్పలని కనిపెట్టారు. దానితో జాగర్తపడ్డ ప్రభుత్వం వెంటనే ఆయా ఉల్లిగడ్డలను ఉపయోగించుకోకుండా, బయట పారేయాలని ప్రజలకు స్పష్టం చేసింది. అప్పటికే 37 రాష్టాలలో అనేక వేలమంది ప్రజలు దానిని వాడి అనారోగ్యం పాలయ్యారు.
అమెరికా సెంట్రల్ ఫర్ డిసీజ్ కంట్రోల్(సీడీసీ) వెంటనే దేశం మొత్తం హై అలర్ట్ ప్రకటించింది. ఆ ఉల్లిగడ్దతొ సహా నిల్వఉంచిన పండ్లను, కూరగాయలను కూడా వాడకుండా పడేయాలని సూచించింది. సిట్టేరో బ్రాండ్ పేరిట అమ్ముతున్న సలామి స్టిక్స్(మాంసాహారం) లోను ఈ తరహా బాక్టీరియా ఉన్నట్టు కనిపెట్టారు. దీనితో ఆయా రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లు, ఇతర దుకాణాలలో ఆయా స్టాక్ ను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ బాక్టీరియా మరీ ప్రమాదం కాకపోయినా వయసులో పెద్దలు, పిల్లలు, రోగనిరోధక వ్యవస్థ సరిగా లేని వారు మాత్రం ప్రమాదం బారిన పడే అవకాశాలు ఉన్నాయని వైద్యశాఖ స్పష్టం చేసింది.
దీని బారిన పడినవారు తీవ్ర జ్వరం, రక్త విరోచనాలు, డిహైడ్రాషన్, ఇతర ఇన్ఫెక్షన్ ల వంటివి ఏర్పడతాయి. అశుచి వలన ఈ తరహా బాక్టీరియా ఏర్పడి, అక్కడ ఉన్న ఈగలు తరహా లాంటి జీవుల ద్వారా ఆయా వస్తువులపైకి చేరి, తద్వారా మనిషికి వ్యాపిస్తుంది. అందుకే ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, కలుషిత నీరు తాగడం లాంటివి మానుకోవాలి, మాంసాహారం, పండ్లు కూరగాయలు వంటివి శుభ్రం చేసుకున్నాకే తీసుకోవాలి. వేడి చేసిన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఇది శరీరంలోకి వెళ్లిన కేవలం నాలుగు గంటలలో ప్రభావం మొదలు అవుతుందని వారు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: